News May 17, 2024

UPI పేమెంట్స్‌లో ఇండియా టాప్

image

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని గ్లోబల్ డేటా సంస్థ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. 2023లో భారత జనాభాలో 90.8% UPI ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. 2024 ఏప్రిల్‌లో ఏకంగా ₹19.64లక్షల కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఇక ఈ మే తొలి 15రోజుల్లోనే ₹10.70లక్షల కోట్ల పేమెంట్స్ జరిగాయి. స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగే కొద్ది డిజిటల్ పేమెంట్స్ పెరుగుతాయని ఆ సంస్థ అంచనా వేసింది.

Similar News

News January 10, 2025

ఇందిరా గాంధీ చాలా బలహీనమైన వ్యక్తి: కంగన

image

మాజీ PM ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా ‘ఎమర్జెన్సీ’ని కంగనా రనౌత్ తెరకెక్కించారు. ఆ మూవీ ప్రమోషన్ల సందర్భంగా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇందిర చాలా బలహీనమైన వ్యక్తి అని నా పరిశోధనలో అర్థమైంది. ఆమె మీద ఆమెకే నమ్మకం లేదు. అందుకే పరిస్థితులపై మరింత నియంత్రణను కోరుకున్నారు. తన మనుగడకు చాలామందిపై ఆధారపడ్డారు. అయితే ఈ సినిమా ద్వారా ఎవరి మనోభావాల్ని దెబ్బతీయాలన్న ఉద్దేశమూ నాకు లేదు’ అని పేర్కొన్నారు.

News January 10, 2025

IMD@150 ఏళ్లు.. సెమినార్‌కు పాక్, బంగ్లాకు ఆహ్వానం

image

1875 జనవరి 15న ప్రారంభమైన భారత వాతావరణ శాఖ‌(IMD)కు 150 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్రం ‘అన్‌డివైడెడ్ ఇండియా’ సెమినార్ నిర్వహించనుంది. ఆ రోజున ప్రత్యేకంగా రూ.150 స్మారక నాణేన్ని విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి పాక్, బంగ్లాదేశ్‌తోపాటు పొరుగున ఉన్న దేశాలు, మిడిల్ ఈస్ట్, సెంట్రల్, సౌత్ వెస్ట్ దేశాలకు ఆహ్వానం పలికింది. తాము హాజరవుతామని పాక్ తెలపగా, బంగ్లా ఇంకా స్పందించలేదు.

News January 10, 2025

జనవరి 10: చరిత్రలో ఈరోజు

image

* 1894: కవి పింగళి లక్ష్మీకాంతం జననం. 1972లో జనవరి 10నే ఆయన కన్నుమూశారు.
* 1920: నానాజాతి సమితిలో సభ్యత్వం పొందిన భారత్
* 1940: ప్రముఖ గాయకుడు, సంగీత విద్వాంసుడు కేజే ఏసుదాసు పుట్టినరోజు(ఫొటోలో)
* 1973: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి రాష్ట్రపతి పాలన విధించారు.