News May 17, 2024

RCB, CSK మధ్య 5 ఓవర్ల మ్యాచ్ జరిగితే?

image

చిన్నస్వామి స్టేడియంలో సబ్-ఎయిర్ సిస్టమ్ ఉండటంతో RCB, CSK మ్యాచ్‌‌పై ఆశలు చిగురిస్తున్నాయి. రాత్రి 10 తర్వాత వర్షం తెరిపిచ్చినా కొన్ని నిమిషాల్లోనే మైదానాన్ని సిద్ధం చేయొచ్చు. అప్పుడు 5 ఓవర్ల మ్యాచ్ జరిగే అవకాశముంది. అదే జరిగి బెంగళూరు 5 ఓవర్లలో 80 రన్స్ చేస్తే చెన్నైని 62 పరుగులకే నియంత్రించాలి. ఛేదనలో అయితే మ్యాచ్‌ను 3.1 ఓవర్లలో ముగించాలి. ఇవి రెండూ సాధ్యంకాకపోతే చెన్నై ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది.

Similar News

News January 7, 2025

సంక్రాంతి బస్సుల్లో 10% రాయితీ: APSRTC

image

సంక్రాంతి రద్దీ దృష్ట్యా 7200 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు APSRTC ప్రకటించింది. రేపటి నుంచి 13 వరకు 3900 స్పెషల్ బస్సులు, హైదరాబాద్ నుంచి 2,153 బస్సులు, బెంగళూరు నుంచి 375 బస్సులు, తిరుగు ప్రయాణాల కోసం 3200 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. ఈ బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని పేర్కొంది. రానూపోనూ టికెట్లు ఒకేసారి బుక్ చేసుకుంటే 10శాతం రాయితీగా ఇస్తామని వెల్లడించింది.

News January 7, 2025

గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ నేతల యత్నం

image

TG: హైదరాబాద్‌లోని నాంపల్లిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నేతల దాడిని నిరసిస్తూ బీజేపీ నేతలు గాంధీభవన్ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో వారిని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. అయినా వారు రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి ముందుకు దూసుకెళ్తున్నారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

News January 7, 2025

భారత్‌లో మైక్రోసాఫ్ట్ 3 బిలియన్ డాలర్ల పెట్టుబడి

image

భారత్‌లో క్లౌడ్, ఏఐ మౌలికవసతుల విస్తరణకు 3 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. ‘భారత్‌లో మునుపెన్నడూ లేని స్థాయిలో భారీగా విస్తరించనున్నాం. మా అజూర్ సామర్థ్యాన్ని మరింతగా పెంచనున్నాం. ప్రధానంగా వివిధ ప్రాంతాలకు సంస్థను విస్తరిస్తున్నాం. 2030నాటికి కోటిమందిని ఏఐ నిపుణులుగా మారుస్తాం’ అని స్పష్టం చేశారు.