News May 17, 2024

బిభవ్ కుమార్‌కు మహిళా కమిషన్ నోటీసులు

image

ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌కు జాతీయ మహిళా కమిషన్ నోటీసులిచ్చింది. ఈనెల 18న విచారణకు రావాలని ఆదేశించింది. అయితే అధికారులు ఆయన ఇంటికి వెళ్తే నోటీసులు తీసుకోవడానికి కుటుంబసభ్యులు నిరాకరించారని, దీంతో ఆయన ఇంటి గేటుకు నోటీసులను అతికించినట్లు మహిళా కమిషన్ ట్వీట్ చేసింది.

Similar News

News January 7, 2025

విరాట్ కోహ్లీపై రోహిత్ కోచ్ పరోక్ష విమర్శలు

image

ఆస్ట్రేలియాతో సిరీస్‌‌లో ఫామ్ లేమి కారణంగా ఆఖరి మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ స్వచ్ఛందంగా జట్టు నుంచి తప్పుకొన్నారు. అయితే ఫామ్‌లో లేనిది రోహిత్ ఒక్కరే కాదు కదా అంటూ ఆయన చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ కోహ్లీపై పరోక్ష విమర్శలు చేశారు. ‘టీ20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్ పూర్తిగా రిటైరై ఉండేవారు. భారత్‌కు టెస్టు ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్‌కప్ అందివ్వడం ఆయన కల. అందుకే కొనసాగుతున్నారు’ అని స్పష్టం చేశారు.

News January 7, 2025

సంక్రాంతి బస్సుల్లో 10% రాయితీ: APSRTC

image

సంక్రాంతి రద్దీ దృష్ట్యా 7200 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు APSRTC ప్రకటించింది. రేపటి నుంచి 13 వరకు 3900 స్పెషల్ బస్సులు, హైదరాబాద్ నుంచి 2,153 బస్సులు, బెంగళూరు నుంచి 375 బస్సులు, తిరుగు ప్రయాణాల కోసం 3200 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. ఈ బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని పేర్కొంది. రానూపోనూ టికెట్లు ఒకేసారి బుక్ చేసుకుంటే 10శాతం రాయితీగా ఇస్తామని వెల్లడించింది.

News January 7, 2025

గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ నేతల యత్నం

image

TG: హైదరాబాద్‌లోని నాంపల్లిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నేతల దాడిని నిరసిస్తూ బీజేపీ నేతలు గాంధీభవన్ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో వారిని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. అయినా వారు రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి ముందుకు దూసుకెళ్తున్నారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.