News May 17, 2024
రేపు కేబినెట్ భేటీ.. రుణమాఫీపై చర్చ!
TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రేపు కేబినెట్ భేటీ కానుంది. రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రాష్ట్ర ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై మంత్రి వర్గం చర్చించనున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్ర విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, ఏపీతో ఉన్న సమస్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశాలపై నివేదిక తయారుచేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది.
Similar News
News January 7, 2025
రామ్ చరణ్, బాలయ్య సినిమాలపై హైకోర్టులో పిల్
AP: సంక్రాంతికి రానున్న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమాల టికెట్ ధరల్ని పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. అది నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. ప్రతివాదులుగా ఆ రెండు సినిమాల మూవీ టీమ్‌లను చేర్చారు.
News January 7, 2025
విరాట్ కోహ్లీపై రోహిత్ కోచ్ పరోక్ష విమర్శలు
ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఫామ్ లేమి కారణంగా ఆఖరి మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ స్వచ్ఛందంగా జట్టు నుంచి తప్పుకొన్నారు. అయితే ఫామ్‌లో లేనిది రోహిత్ ఒక్కరే కాదు కదా అంటూ ఆయన చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ కోహ్లీపై పరోక్ష విమర్శలు చేశారు. ‘టీ20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్ పూర్తిగా రిటైరై ఉండేవారు. భారత్‌కు టెస్టు ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్‌కప్ అందివ్వడం ఆయన కల. అందుకే కొనసాగుతున్నారు’ అని స్పష్టం చేశారు.
News January 7, 2025
సంక్రాంతి బస్సుల్లో 10% రాయితీ: APSRTC
సంక్రాంతి రద్దీ దృష్ట్యా 7200 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు APSRTC ప్రకటించింది. రేపటి నుంచి 13 వరకు 3900 స్పెషల్ బస్సులు, హైదరాబాద్ నుంచి 2,153 బస్సులు, బెంగళూరు నుంచి 375 బస్సులు, తిరుగు ప్రయాణాల కోసం 3200 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. ఈ బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని పేర్కొంది. రానూపోనూ టికెట్లు ఒకేసారి బుక్ చేసుకుంటే 10శాతం రాయితీగా ఇస్తామని వెల్లడించింది.