News May 17, 2024

2031కి భారత వినియోగదారుల మార్కెట్ డబుల్: నిర్మల

image

దేశ వినియోగదారుల మార్కెట్ 2031 నాటికి రెండింతలు కానుందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఐదేళ్లలో ప్రపంచవృద్ధిలో భారత్ వాటా 18% ఉండొచ్చని అంచనా వేశారు. తయారీ రంగాన్ని మరింత సమర్థంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో డిమాండ్‌ను చేరుకోవడంతో పాటు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వార్షిక సదస్సు సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

Similar News

News January 7, 2025

ఎవరు లబ్ధి పొందారో తెలియాలి: హైకోర్టు జడ్జి

image

TG: KTR క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ జారీ చేసిన ఆర్డర్ కాపీలో జడ్జి కీలక అంశాలను ప్రస్తావించారు. HMDA పరిధికి మించి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిందని, క్యాబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాలని అభిప్రాయపడ్డారు. KTR ఆదేశాలతోనే చెల్లింపులు జరిగాయని ప్రభుత్వం అంటోందని, చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో తెలియాలని జడ్జి పేర్కొన్నారు. అంతిమ లబ్ధిదారులెవరో బయటపడాలని తీర్పు కాపీలో వెల్లడించారు.

News January 7, 2025

91 లక్షల మందికి ఫ్రీ సిలిండర్లు అందజేత: టీడీపీ

image

AP: ‘దీపం-2’ పథకం కింద ఇప్పటివరకూ 91 లక్షల ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేసినట్లు టీడీపీ వెల్లడించింది. మొత్తం లబ్ధిదారుల సంఖ్య 1.55కోట్లుగా పేర్కొంది. ఈ ఏడాది మార్చి 31లోపు ఎప్పుడైనా సిలిండర్‌ను బుక్ చేసుకుని మొదటి ఉచిత సిలిండర్‌ను పొందవచ్చని తెలిపింది. 48 గంటల్లోనే సిలిండర్ డబ్బుల్ని జమ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్న సంగతి తెలిసిందే.

News January 7, 2025

రామ్ చరణ్, బాలయ్య సినిమాలపై హైకోర్టులో పిల్

image

AP: సంక్రాంతికి రానున్న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమాల టికెట్ ధరల్ని పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. అది నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. ప్రతివాదులుగా ఆ రెండు సినిమాల మూవీ టీమ్‌లను చేర్చారు.