News May 17, 2024
‘ఫ్రైడే’.. నో సినిమా డే!
శుక్రవారం వచ్చిందంటే చాలు ఏదో ఒక కొత్త సినిమా రిలీజవడంతో థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంటుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకునేందుకు యూట్యూబర్లు సైతం క్యూ కడుతుంటారు. సమ్మర్ హాలీడేస్‌లో మరింత కిటకిటలాడాల్సిన థియేటర్లు మూగబోయాయి. పెద్ద హీరోల సినిమా ఒకటీ లేకపోవడంతో థియేటర్లకు ప్రేక్షకులు రావట్లేదు. దీంతో కొందరు థియేటర్ యజమానులు కొన్నిరోజులు థియేటర్లను మూసివేసేందుకు సిద్ధమయ్యారు.
Similar News
News January 11, 2025
ALERT.. పెరగనున్న చలి తీవ్రత
TG: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం మరో 4 రోజులు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో చలి తీవ్రత మరింత పెరగనున్నట్లు తెలిపింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు దిగువన నమోదవుతున్నాయని పేర్కొంది. కొమురం భీం(D) తిర్యాణీలో 6.8, ఆదిలాబాద్(D) భీంపూర్‌లో 7, నిర్మల్(D) పెంబీలో 9.1, సంగారెడ్డి(D) న్యాల్‌కల్‌లో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది.
News January 11, 2025
అదనపు ఛార్జీలు వసూలు చేస్తే బస్సు సీజ్: పొన్నం
TG: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల వద్ద ప్రైవేటు ట్రావెల్స్ ఎక్స్‌ట్రా ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తామని మంత్రి పొన్నం హెచ్చరించారు. అదనపు ఛార్జీల పేరిట ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేటు బస్సులు ఎక్స్‌ట్రా ఛార్జీలు అడిగితే ప్రయాణికులు రవాణా శాఖ దృష్టికి తేవాలని మంత్రి సూచించారు. ఆర్టీసీ అధికారులు డిపోల వద్ద తనిఖీలు చేయాలని ఆదేశించారు.
News January 11, 2025
CTకి భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు భారత జట్టు ప్రకటన ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 12లోపు అనౌన్స్ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు BCCI ఎలాంటి ప్రకటన చేయలేదు. ICCని గడువు పొడిగించాలని అభ్యర్థించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18 లేదా 19న జట్టు ప్రకటన ఉంటుందని సమాచారం. CTతో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న T20, వన్డేలకు జట్లను ప్రకటించలేదు. అయితే, రెండ్రోజుల్లో T20 జట్టును ప్రకటిస్తారని క్రీడావర్గాలు చెబుతున్నాయి.