News May 17, 2024

శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడండి: డీకే బాలాజీ

image

జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం రెవెన్యూ, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల కొన్ని జిల్లాల్లో గొడవలు, అవాంఛనీయ సంఘటనలు జరిగిన దృష్ట్యా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎక్కడా కూడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలన్నారు.

Similar News

News April 22, 2025

కృష్ణాజిల్లాలో ఉత్కంఠత

image

పదవ తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో మొత్తం 25,259మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. రెగ్యులర్ విద్యార్థులు 21,009, ప్రైవేట్, ఒకేషనల్ విద్యార్థులు 4,250 మంది ఉన్నారు. రేపు విడుదలయ్యే పరీక్షా ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 

News April 22, 2025

కృష్ణా: ‘ఈ- కేవైసీ చేయకపోతే రేషన్ అందదు’

image

రేషన్ కార్డు లబ్ధిదారులు ఏప్రిల్ 30లోపు కేవైసీ పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సూచించారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటనను విడుదల చేశారు. జిల్లాలో 71,110 మంది ఇంకా చేయాల్సి ఉందని చెప్పారు. 5 ఏళ్లు లోపు, 80 ఏళ్లు పైబడినవారికి మినహాయింపు ఉందన్నారు. సంబంధిత వివరాలు డీలర్లు, తహసీల్దార్ల వద్ద ఉన్నాయని, గడువు మించినవారికి పథకాల లబ్ధి ఉండదని హెచ్చరించారు.

News April 22, 2025

ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

image

పెనమలూరు మండలం పెద్దపులిపాకలో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ రాజేష్ (29) విజయవాడ ఆటోనగర్లో వెల్డింగ్ పని చేసేవాడు. కొంతకాలం నుంచి మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో పెదపులిపాకలోని తన ఇంట్లో సోమవారం సాయంత్రం రాజేశ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!