News May 17, 2024
బాపట్ల: ఎన్నికల ఘర్షణలో 284 మందిపై కేసులు

బాపట్ల జిల్లాలో జరిగిన ఎన్నికల ఘర్షణలో 284 మంది పై కేసులు నమోదు చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు 255 మందిని అదుపులోకి తీసుకొని నోటీసులు జారీ చేశామని తెలిపారు. జిల్లాలో ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News January 10, 2026
గుంటూరులో నేటి నుంచి UTF రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (UTF) 51వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నేటి నుంచి గుంటూరులో ప్రారంభం కానున్నాయి. రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలకు గుంటూరు ఆంధ్రా క్రైస్తవ కళాశాల వేదికగా నిలవనుంది. పీడీఎఫ్ ఎమ్మెల్సీలతో పాటూ, యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు ఇప్పటికే పూర్తి చేశారు.
News January 9, 2026
గుంటూరులో MDMA మత్తు పదార్థాల పట్టివేత

గంజాయి, MDMA మత్తు పదార్థాలను కొత్తపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద మున్నా, చిల్లర ప్రేమ కుమార్ విక్రయదారుల నుంచి లిక్విడ్ గంజాయి, MDMA 3.12 గ్రాములు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గుంటూరు నగరంలో మత్తు పదార్థాల విక్రయం, సేవనం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ హెచ్చరించారు. నిందితులకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిందన్నారు.
News January 9, 2026
పది విద్యార్థులు ఫ్లయింగ్ కలర్స్‌తో పాస్: గుంటూరు కలెక్టర్

పదో తరగతి విద్యార్థులు అందరూ ఫ్లయింగ్ కలర్స్‌తో పాస్ అవుతారని కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రోత్సహించారు. SC, ST, BC, మైనారిటీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల కోసం నిర్వహించిన విజయం మనదే కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. లక్ష్యాలను పెట్టుకుని వాటి విజయానికి కృషి చేయాలని సూచించారు. పరీక్షలపై భయం లేకుండా పాజిటివ్ మైండ్‌సెట్‌తో చదవాలని తెలిపారు. విద్యార్థులకు విజయం మనదే స్టడీ మెటీరియల్ ఇచ్చారు.


