News May 17, 2024
అభిమానుల ప్రేమ వెలకట్టలేనిది: పంత్
IPL-17 నుంచి ఢిల్లీ నిష్క్రమించడంపై కెప్టెన్ పంత్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘చాలా కాలం తర్వాత మైదానంలోకి దిగడం అద్భుతంగా అనిపించింది. నాకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు. నాపై అభిమానులు చూపుతున్న ప్రేమ వెలకట్టలేనిది. నేను ఇష్టపడే క్రికెట్ ఆడుతున్నందుకు థ్రిల్‌గా ఉంది. మున్ముందు మరిన్ని అద్భుతమైన జ్ఞాపకాలను సంపాదించుకోవాలని ఎదురుచూస్తున్నా’ అంటూ పంత్ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.
Similar News
News December 22, 2024
ఆ దేశంతో టెస్టు సిరీస్ ఆడలేకపోయిన అశ్విన్
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అన్ని దేశాలతో టెస్టు మ్యాచులు ఆడారు. కానీ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మాత్రం ఒక్క టెస్టు కూడా ఆడకుండానే రిటైర్మెంట్ ఇచ్చారు. భారత్-పాక్ మధ్య 2008 నుంచి టెస్టు సిరీస్ జరగలేదు. అశ్విన్ 2011లో టెస్ట్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటినుంచి ఇప్పటివరకూ ఇరు దేశాల మధ్య ఒక్క టెస్టు మ్యాచ్ కూడా జరగలేదు. దీంతో ఆయన ఆ దేశంతో ఆడలేకపోయారు.
News December 22, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
AP: రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, కోనసీమ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. అలాగే ఎల్లుండి ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News December 22, 2024
రేవంత్.. వీటినే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు: టీడీపీ మహిళా నేత
TG: అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వ చర్యలను సమర్థిస్తూనే రేవంత్‌పై తెలంగాణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న Xలో ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఫుడ్ పాయిజన్‌తో పిల్లల చావులకు బాధ్యులు ఎవరు? రుణమాఫీ అవ్వక మరణించిన రైతుల ప్రాణాలకు బాధ్యులెవరు? ఆత్మహత్య చేసుకున్న చేనేత సోదరుల మరణాలకు కారణమెవరు? ఇతర సమస్యలపై అసెంబ్లీలో చర్చించేందుకు సమయం లేదా?’ అన్నారు. వీటినే డైవర్షన్ పాలిటిక్స్ అంటారని పేర్కొన్నారు.