News May 17, 2024

ఏపీలో అల్లర్లపై సిట్.. సభ్యులు వీరే

image

ఏపీలో అల్లర్లపై ప్రభుత్వం 13 మంది సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసింది. IPS అధికారి వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్‌లో సభ్యులుగా ACB ఎస్పీ రమాదేవి, ఏఎస్పీ సౌమ్యలత, CID DSP శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీలు రమణమూర్తి, శ్రీనివాస రావు, రవి మనోహర ఆచారి, ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్ వెంకట్రావు, ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు రామకృష్ణ, శ్రీనివాస్, ఎన్.ప్రభాకర్, శివప్రసాద్, మోయిన్, వి. భూషణం ఉన్నారు.

Similar News

News December 22, 2024

GST నిర్ణయాలు: ధర పెరిగేవి, తగ్గేవి ఇవే

image

ధ‌ర‌లు త‌గ్గేవి: ప‌్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌లో ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ *జన్యు చికిత్సలకు చేసే జీన్ థెర‌పీ *ప్ర‌భుత్వ ప‌థ‌కాల కింద ఆహార పంపిణీకి వాడే ముడి స‌రుకులు *రైతులు నేరుగా విక్ర‌యించే మిరియాలు, ఎండుద్రాక్ష‌పై నో GST. ధ‌ర‌లు పెరిగేవి: పాత వాహ‌నాల అమ్మ‌కాలు *రెడీ2ఈట్ పాప్‌కార్న్ *కార్పొరేట్ స్పాన్స‌ర్‌షిప్ సేవ‌లు *ఆటోక్లేవ్డ్ ఎరేటెడ్ కాంక్రీట్ బ్లాక్స్‌లో 50+% ఫ్లై యాష్ ఉంటే అధిక GST.

News December 22, 2024

లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తాం: మంత్రి

image

AP: రాష్ట్రంలో ఉచిత బస్సు పథకాన్ని ఎవరూ వేలెత్తి చూపించకుండా అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఒకటో తేదీన ప్రారంభించి 16న మూసేయడం తమకు ఇష్టం లేదన్నారు. కాస్త లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తామని డైలాగ్ వేశారు. పథకం అమలయ్యేనాటికి సమస్యలను అధిగమించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. త్వరలో 1400 బస్సులను అందుబాటులోకి తెస్తామని, ఆ తర్వాత మరో 2000 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తామన్నారు.

News December 22, 2024

723 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్

image

ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్(AOC)లో 723 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి నేటితో గడువు ముగియనుంది. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, బీటెక్ పాసైనవారు అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. పే స్కేల్ రూ.18వేలు-రూ.92,300 మధ్య ఉంటుంది. పూర్తి వివరాల కోసం <>ఇక్కడ క్లిక్<<>> చేయండి. వెబ్‌సైట్: aocrecruitment.gov.in