News May 18, 2024

గజ్వేల్: ‘తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం’

image

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సిద్దిపేట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి తనూజ తెలిపారు. గజ్వేల్‌ మండల పరిధిలోని జాలిగామ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని, ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు.

Similar News

News October 5, 2024

మెదక్: పక్కాగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన: అదనపు కలెక్టర్

image

డిఎస్సీ 2024లో అర్హత సాధించిన 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ పక్కాగా, వేగవంతంగా చేపట్టాలని మెదక్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. డీఎస్సీ 2024లో 704 ఎంపికయ్యారని 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమం స్థానిక బాలుర జూనియర్ కళాశాలలో జరుగుతుండగా గురువారం సందర్శించారు. మొత్తం 704 మంది అభ్యర్థులకుగాను 618 మంది అభ్యర్థులు వచ్చారు.

News October 5, 2024

మెదక్: ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన

image

ఉమ్మడి జిల్లాలోని మెదక్,సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో రెండు రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.మెదక్,సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.వాతావరణం మబ్బు పట్టి ఉంటుందని,కొన్నిచోట్ల మోస్తారు వర్షం మరి కొన్నిచోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.

News October 4, 2024

సిద్దిపేటలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

సిద్దిపేట పట్టణం శివాజీ నగర్‌లో ఓ ఇంట్లో వ్యభిచార నడిపిస్తున్నారని సమాచారంతో సిద్దిపేట టాస్క్ ఫోర్స్, వన్ టౌన్ పోలీసుల దాడి చేశారు. ఈ దాడిలో నలుగురి విటులు, ఓ మహిళను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2 వేల నగదు, 6 సెల్ ఫోన్స్, ఓ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు.