News May 18, 2024
జి.కొండూరు: టైర్ పేలి వ్యక్తి మృతి.. ఇద్దరికి గాయాలు
జి.కొండూరులో వ్యాన్ టైర్లు పేలి పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనలో ప్రవీణ్(36)అనే వ్యక్తి మృతిచెందగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు మంగళగిరికి చెందిన ప్రసాదరావు, ఇర్మీయా, ప్రవీణ్ గేదెల వ్యాపారం చేస్తుంటారు. శుక్రవారం తిరువూరులో గేదెలు కొని మంగళగిరి వెళుతుండగా జి.కొండూరులో వ్యాను టైర్ పేలి ప్రవీణ్ మృతిచెందాడు. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 30, 2024
విజయవాడ: ఇన్స్టాగ్రామ్ ప్రేమ.. నిరాకరించడంతో సూసైడ్
ఇన్స్టాగ్రామ్ ప్రేమ కథ విషాదంగా మారిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. బుధవారం ఏలూరు కాలువలో దూకిన యువతి కోసం గవర్నర్‌పేట పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఈ సందర్భంగా సీఐ అడపా నాగమురళి మాట్లాడుతూ.. యువతి మృతదేహాన్ని శుక్రవారం రామవరప్పాడులో ఏలూరు కాలువకట్ట వద్ద గుర్తించినట్లు వెల్లడించారు. అనంతరం ఆ యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.
News November 30, 2024
ఎన్టీఆర్ జిల్లాలో 4,600 మందికి ఉపాధి కల్పించాం: బీజేపీ
కేంద్ర పథకమైన జన శిక్షణ సంస్థాన్(JSS) కింద ఎన్టీఆర్ జిల్లాలోని 4,600 మంది మహిళలకు ఉపాధి కల్పించామని ఏపీ బీజేపీ తమ అధికారిక X ఖాతాలో శుక్రవారం పోస్ట్ చేసింది. ఈ పథకం కింద జిల్లాలోని మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించామని తెలిపింది. ఫుడ్ ప్రాసెసింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, దుస్తుల కుట్టుపని తదితర కార్యకలాపాలలో మహిళలకు ఉపాధి కల్పించాలని బీజేపీ తమ అధికారిక ఖాతాలో వెల్లడించింది.
News November 29, 2024
‘ఫెంగల్’ తుఫానుపై APSDMA ఏం చెప్పిందంటే..
కృష్ణా: ఫెంగల్’ తుఫాను శుక్రవారం సాయంత్రం పుదుచ్చేరికి 270కి.మీ, చెన్నైకి 300 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. ఈ మేరకు APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు. తుఫాన్ ప్రభావం దక్షిణ కోస్తా ప్రాంతాలైన బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలపై ఉంటుందన్నారు. మత్స్యకారులు ఈ నెల 30 వరకు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దన్నారు.