News May 18, 2024
కొత్తగూడెం: పోక్సో కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలు

పోక్సో కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ 5 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ఇన్‌ఛార్జ్ న్యాయమూర్తి పాటిల్ వసంత్ శుక్రవారం తీర్పునిచ్చారు. అశ్వాపురం మండలానికి చెందిన ఓ మహిళ తన మనవరాలితో కలిసి నివసిస్తుంది. 2021 డిసెంబర్ 30న మహిళ ఇంట్లో లేని సమయంలో ఇంటి పక్కనే ఉన్న సాంబశివరావు అనే వ్యక్తి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కేసు విచారించి శిక్ష విధించారు.
Similar News
News July 5, 2025
విద్యాలయాల్లో మౌళిక వసతుల కల్పనకు కృషి: ఖమ్మం కలెక్టర్

రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో చదువుకునే విద్యార్థులకు అవసరమైన మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శనివారం ఖమ్మం దానవాయిగూడెం, కోయచిలక క్రాస్ రోడ్డులోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. గురుకులంలో చేపట్టాల్సిన మైనర్ మరమ్మతులపై నివేదిక అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News July 5, 2025
38 సబ్ స్టేషన్లలో RTFMS పనులు పూర్తి: ఖమ్మం SE

వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం (RTFMS) ఎంతగానో దోహదపడుతుందని ఖమ్మం సర్కిల్ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసా చారి అన్నారు. శనివారం ఎన్పీడీసీఎల్ పరిధిలో 100 సబ్ స్టేషన్లను గుర్తించామని, సర్కిల్ పరిధిలో 38 సబ్ స్టేషన్లలో RTFMS పనులు జరుగుతున్నాయని వివరించారు. మిగతా సబ్ స్టేషన్లలో కూడా త్వరలోనే పనులు పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు.
News July 5, 2025
రాజకీయాలు కాదు రైతుల శ్రేయస్సు ముఖ్యం: మంత్రి తుమ్మల

యూరియా విషయంలో ఎలాంటి రాజకీయం లేదని, రైతుల శ్రేయస్సే ముఖ్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టం చేశారు. ఈ విషయంపై రాజకీయాలు వద్దని.. రాష్ట్రానికి వాటాగా రావాల్సిన 1.94 లక్షల టన్నుల యూరియాను తెప్పించేలా బీజేపీ నేతలు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ప్రస్తుత వానాకాలం (ఖరీఫ్) సీజన్ కోసమే యూరియా అడిగిందని, గత యాసంగి (రబీ) సీజన్‌కు సంబంధించింది కాదని స్పష్టం చేశారు.