News May 18, 2024
మనుబోలు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
మనుబోలు మండల పరిధిలోని హైవేపై వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన సాంబశివరావు (40) మృతి చెందాడు. లారీ డ్రైవర్ సాంబశివరావు లారీతో గుంటూరు నుంచి తిరుపతి వెళుతున్నాడు. వీరంపల్లి రోడ్డు వద్ద లారీని ఆపి ఇంజిన్ ఆయిల్ పోస్తుండగా నెల్లూరు నుంచి చెన్నై వైపు వెళ్తున్న వాహనం ఢీ కొని చనిపోయాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 22, 2025
బుచ్చి మండలంలో అమానుష ఘటన
ఓ కసాయి తండ్రి తన బిడ్డలను అమ్ముకున్న ఘటన బుచ్చి(M) మినగల్లులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు.. పేడూరు రవి, వెంకమ్మ దంపతులకు ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల. మొదటగా పుట్టిన మగ బిడ్డను ఐదేళ్ల క్రితం లక్ష రూపాయలకు అమ్మేశారు. రెండు రోజుల క్రితం మరో మగ బిడ్డను రవి హైదరాబాద్కు తీసుకెళ్లి అమ్మాడని వెంకమ్మ తెలిపింది. దీంతో సర్పంచ్ పూజిత ఎంపీడీవో శ్రీహరికి ఫిర్యాదు చేశారు.
News January 22, 2025
మలేషియా జైలులో నెల్లూరు జిల్లా యువకులు
తిరుపతిలోని ట్రావెల్ ఏజెంట్ల మోసంతో ఇద్దరు యువకులు మలేషియా జైల్లో ఉన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచర్లకు చెందిన పవన్, సింహాద్రి అనే యువకులను టూరిస్ట్ వీరస్వామి మాయమాటలతో వర్కింగ్ పర్మిట్ మీద మలేషియా పంపాడు. వీరిద్దరూ అక్కడి హోటల్లో పనిచేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మూడు నెలల నుంచి ఆచూకీ లేదని తమ బిడ్డలను ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని బాధితుల తల్లిదండ్రులు కోరారు.
News January 22, 2025
కలెక్టర్ సమక్షంలో విద్యాశాఖ పునర్విభజన సన్నాహక సమావేశం
పాఠశాలల పునర్విభజన బోధన సిబ్బంది పునర్నిర్మాణం సన్నాహక సమావేశం నెల్లూరు నగరంలోని జిల్లా కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ సమక్షంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోను తూచా తప్పకుండా పాటించాలని, గ్రామస్థుల సూచనలు, వారిని సమన్వయం చేయాలని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ బాలాజీ రావు కొన్ని సూచనలు, మార్పులను ప్రతిపాదించారు.