News May 18, 2024

T20 WC వచ్చేస్తోంది.. ఫామ్‌లోకి వచ్చేయండి!

image

IPL-2024 పూర్తికాగానే జూన్ 2 నుంచి టీ20 వరల్డ్ కప్ మొదలుకానుంది. అయితే, భారత ప్లేయర్లు ఫామ్‌లో లేకపోవడం అభిమానులను కలవరపెడుతోంది. నిన్నటి మ్యాచ్‌లో రోహిత్ కాస్త మెరుగవగా.. సూర్యకుమార్ డకౌట్ అయ్యారు. హార్దిక్ IPL మొత్తంలోనూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. లీగ్ మ్యాచుల్లో ఐర్లాండ్, కెనడా, USA జట్లపై టీమ్ఇండియా సునాయసంగా గెలుస్తుందని ఆ లోపు ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

Similar News

News December 22, 2024

రూ.5,000 కోట్లతో జెఫ్ బెజోస్ మళ్లీ పెళ్లి

image

అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ మరోసారి పెళ్లిపీటలెక్కుతున్నారు. ఈ నెల 28న తన గర్ల్ ఫ్రెండ్ లారెన్ సాంచెజ్‌ను ఆయన వివాహమాడతారు. ఈ వేడుకను రూ.5,000 (600 మిలియన్ల డాలర్లు) కోట్ల ఖర్చుతో కొలరాడోలో గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లికి అతిరథ మహారథులను ఆహ్వానిస్తారని సమాచారం. కాగా బెజోస్ గతంలో మెకంజీ స్కాట్‌ను పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చారు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు.

News December 22, 2024

మనవడి రికార్డు.. చంద్రబాబు ప్రశంసలు

image

నారా వారసుడు దేవాన్ష్ <<14952633>>ప్రపంచ రికార్డు<<>> సృష్టించడంతో తాత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు Xలో సంతోషం వ్యక్తం చేశారు. కృషి, పట్టుదల, అంకితభావం విజయానికి కీలకమని, ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు కొన్ని నెలలుగా దేవాన్ష్ పడిన కష్టాన్ని చూసి గర్విస్తున్నట్లు పేర్కొన్నారు. దేవాన్ష్‌ నిబద్ధత కళ్లారా చూశామని, ఈ ఘనత అందుకోవడం గర్వంగా ఉందని తల్లిదండ్రులు లోకేశ్, బ్రహ్మణి ట్వీట్ చేశారు.

News December 22, 2024

క్రిస్మస్ సెలవులు ఎన్ని రోజులంటే?

image

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సెలవులపై కొందరు అయోమయానికి గురవుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 25, 26న పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. ఆ రెండు రోజులు స్కూళ్లు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ఉంటాయి. 24న ఆప్షనల్ హాలిడే ఉండటంతో కొన్ని స్కూళ్లు ఆ రోజూ సెలవు ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో 25న మాత్రమే పబ్లిక్ హాలిడే ఉండగా, 24, 26 తేదీల్లో ఆప్షనల్ హాలిడేస్ ఇచ్చారు.