News May 18, 2024

కర్నూలు: రాబోయే ఐదు రోజులు తేలికపాటి వర్షాలు

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో చిరు జల్లుల నుంచి తేలికపాటి వర్ష సూచన ఉందని శుక్రవారం బనవాసి ఫారం కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త అశోక్ కుమార్ తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 36.2 డిగ్రీల నుంచి 40 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 24.6 డిగ్రీల నుంచి 27.4 డిగ్రీల వరకు ఉంటాయన్నారు. వర్షాలు కురవడంతో రైతులు లోతు దుక్కులు చేసుకోవాలని సూచించారు. నిన్న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి.

Similar News

News September 13, 2025

సీజనల్ హాస్టళ్ల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం: డీఈవో

image

వలస వెళ్లే తల్లిదండ్రులు తమ పిల్లలను వెంట తీసుకుపోకుండా ఈ ఏడాది జిల్లాలో సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేయనున్నట్లు డీఈవో శామ్యూల్ పాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కుర్నూలు జిల్లాలో ఈ నెల నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. హాస్టళ్లు నిర్వహించేందుకు ఆసక్తి ఉండి, సేవాభావం కలిగిన పొదుపు, ఎన్జీవో సంఘాలు ఈ నెల 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

News September 13, 2025

నకిలీ ఏపీకే ఫైళ్ల జోలికి వెళ్లొద్దు: కర్నూలు ఎస్పీ

image

జిల్లా ప్రజలు నకిలీ ఏపీకే ఫైళ్లకు దూరంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. వాట్సాప్‌లో ఆర్టీవో ఛలాన్, ఎస్బీఐ రివార్డ్స్, పీఎం కిసాన్ పేర్లతో వచ్చే నకిలీ ఫైళ్లను క్లిక్ చేయవద్దని సూచించారు. వీటిని ఇన్‌స్టాల్ చేస్తే బ్యాంక్ ఖాతా వివరాలు హ్యాకర్లకు చేరడంతో పాటు, వాట్సాప్ కూడా హ్యాక్ అవుతుందని పేర్కొన్నారు.

News September 12, 2025

‘దసరా బిగ్ సేల్’ ఆఫర్లతో జాగ్రత్త: కర్నూలు ఎస్పీ

image

దసరా వేళ బిగ్ సేల్ ఆఫర్లతో వచ్చే సోషల్ మీడియా ప్రకటనలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో సైబర్ నేరగాళ్లు తక్కువ ధరల్లో వస్తువులు అంటూ లింకులు పంపిస్తున్నారన్నారు. వాటిని క్లిక్ చేస్తే ద్విచక్ర వాహనాలు, కార్లు గెలుస్తారని మభ్యపెట్టి మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. తెలియని లింకులు ఓపెన్ చేయవద్దని సూచించారు.