News May 18, 2024
EAPCET టాప్ ర్యాంకర్లు ఎవరంటే?
తెలంగాణ EAPCET ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్ విభాగంలో శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన జ్యోతిరాదిత్య ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీలో మదనపల్లెకు చెందిన ప్రణీత తొలిస్థానంలో నిలిచారు. ఈఏపీ సెట్‌కు 3,32,251 మంది హాజరయ్యారని, అందులో ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618, అగ్రికల్చర్, ఫార్మసీ 91,633 మంది విద్యార్థులున్నారని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.
Similar News
News December 25, 2024
జానీ మాస్టర్‌కు మరో షాక్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడులకు పాల్పడ్డట్లు అందులో పేర్కొన్నారు. ఈవెంట్ల పేరుతో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి ఆమెను వేధించినట్లు నిర్ధారించారు. కాగా జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిల్‌పై విడుదలై బయట ఉన్నారు.
News December 25, 2024
తెలంగాణ ప్రభుత్వానికి రాహుల్ అభినందనలు
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. ‘మనం ఇచ్చిన గ్యారంటీలను నెరవేరుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు. రవాణా, బీసీ సంక్షేమ శాఖలో చేపడుతున్న చర్యలు అభినందనీయం’ అని పొన్నం ప్రభాకర్ పేరిట ఆయన లెటర్ రాశారు. ప్రజలందరికీ న్యాయం జరిగేలా ఇలానే ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.
News December 25, 2024
WhatsAppలో అదిరిపోయే ఫీచర్
వాట్సాప్‌లో సూపర్ ఫీచర్ వచ్చింది. ఏదైనా డాక్యుమెంట్‌ను స్కాన్ చేయాలంటే ఇక థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు. నేరుగా వాట్సాప్‌లోనే స్కాన్ చేసి షేర్ చేసుకునే వెసులుబాటు వచ్చింది. ప్రస్తుతం iOS యూజర్లకు ఈ ఫీచర్ రాగా, త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకూ అందుబాటులోకి రానుంది. డాక్యుమెంట్ షేరింగ్ మెనూ ఓపెన్ చేసి, ‘SCAN DOCUMENT’పై క్లిక్ చేస్తే స్కాన్ చేసుకోవచ్చు. బ్లాక్&వైట్ మోడ్, PDF లాంటి ఆప్షన్లు ఉంటాయి.