News May 18, 2024
నా రికార్డ్స్ సేఫ్: ఉసేన్ బోల్ట్
వచ్చే నెలలో మొదలయ్యే టీ20 వరల్డ్ కప్‌నకు పరుగుల రారాజు ఉసేన్ బోల్ట్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన రికార్డులపై స్పందించారు. ‘వాటిని ఇప్పట్లో ఎవరూ ఛేదించలేరు. నాకు ఆ టెన్షన్ లేదు. ప్రస్తుతం రిటైర్మెంట్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా’ అని వివరించారు. 100 మీటర్ల దూరాన్ని 9.58 సెకన్లలో, 200 మీటర్లను 19.19 సెకన్లలో పరిగెత్తి బోల్ట్ 2009లో చరిత్రకెక్కారు.
Similar News
News December 27, 2024
భూముల విలువ పెంపు నిర్ణయం వాయిదా
AP: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను జనవరి 1 నుంచి 10-20శాతం పెంచాలన్న నిర్ణయంపై కూటమి ప్రభుత్వం పునరాలోచనలో పడింది. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుండటంతో అమలును వాయిదా వేసింది. ఈ అంశంపై మరోసారి సమగ్రంగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ నెల 30న మంగళగిరిలో సీసీఎల్ఏ కార్యాలయంలో జోనల్ రెవెన్యూ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
News December 27, 2024
డైరెక్టర్ కన్నుమూత
తమిళ దర్శకుడు సభాపతి దక్షిణామూర్తి అలియాజ్ SD సభా(61) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన తమిళంలో విజయ్‌కాంత్ హీరోగా భారతన్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ప్రభుదేవాతో వీఐపీ అనే సినిమాను తెరకెక్కించారు. తెలుగులో 2005లో జగపతిబాబు, కళ్యాణి జంటగా పందెం అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. సభా తమిళంలో తీసిన సుందర పురుషుడు అనే సినిమా ‘అందాల రాముడు’గా రీమేక్ చేశారు. మొత్తంగా 10 మూవీలకు పనిచేశారు.
News December 27, 2024
నల్ల బ్యాండ్లతో భారత క్రికెటర్లు
బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజు భారత క్రికెటర్లు చేతికి నల్ల బ్యాండ్లతో కనిపించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణానికి సంతాపంగా వీటిని ధరించారు. రెండో రోజు ఆటలో కమిన్స్(49) వికెట్‌ను జడేజా తీశారు. మరోవైపు సెంచరీ తర్వాత స్మిత్ దూకుడు పెంచారు. AUS స్కోరు 446/7.