News May 18, 2024
ADB ఉమ్మడి జిల్లాలో ఒక్కరోజే 9 మంది మృతి

ఉమ్మడి ADB జిల్లాలో వివిధ కారణాలతో శుక్రవారం 9 మంది మృతిచెందారు.
ADBలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి. మావల, కుంటాలలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి. ఇంద్రవెల్లిలో కడుపు నొప్పి భరించలేక యువతి సూసైడ్. వాంకిడిలో ఇష్టంలేని పెళ్లి చేశారని నవవరుడు సూసైడ్. ఆసిఫాబాద్‌లో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, ఖానాపూర్‌లో బైక్‌తో చెట్టును ఢీకొని వ్యక్తి మృతి. కాసిపేటలో ఐచర్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి.
Similar News
News February 28, 2026
ఆదిలాబాద్: ఇంగ్లిష్ పరీక్షకు 364 మంది గైర్హాజరు

జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. శనివారం నిర్వహించిన ఆంగ్ల పరీక్ష సజావుగా ముగిసిందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (DIEO) జాదవ్ గణేష్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 8,622 మంది విద్యార్థులకు గాను 8,258 మంది పరీక్షకు హాజరయ్యారని, 364 మంది గైర్హాజరైనట్లు వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
News February 28, 2026
ఆదిలాబాద్: రోబోటిక్స్ కోర్సు దరఖాస్తుకు నేడే ఆఖరు

ఆదిలాబాద్ పట్టణంలోని ATC కేంద్రంలో PMKVY 4.0 కింద ‘ఆటోమోటివ్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజినీర్’ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. మూడు నెలల కాలపరిమితి గల ఈ స్వల్పకాలిక శిక్షణ ద్వారా అభ్యర్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం సాధించవచ్చన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 28 సాయంత్రం 5 గంటల లోపు కళాశాలలో సంప్రదించాలన్నారు.
News February 28, 2026
ఆదిలాబాద్: ఆరుగురు దోపిడీ దొంగలు అరెస్టు

ఆదిలాబాద్ రైల్వే స్టేషన్, రిమ్స్ పరిసరాల్లో సెల్‌ఫోన్లు లాక్కొంటున్న ఆరుగురు దోపిడీ దొంగల ముఠాను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 15న జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి సీఐ నాగరాజు ఆధ్వర్యంలో నిందితులను పట్టుకున్నారు. వారిలో ఒకరు బాల నేరస్థుడు ఉన్నాడు. నిందితుల నుంచి 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీరిపై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.


