News May 18, 2024

NLG: ఆ టేస్టే వేరు.. సాగర్ టు బంగ్లాదేశ్!

image

నాగార్జునసాగర్ చేపల టేస్టే వేరు. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. సాగర్ వెనుక జలాలు, AMRP, ఏకేబీఆర్ ప్రాజెక్టులో లభించే చేపలు కొంచెం తియ్యగా, చప్పగా ప్రత్యేకంగా ఉండడంతో భోజన ప్రియులు ఈ చాపలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతేకాదు ఈ చాపల కోసం బంగ్లాదేశ్ దేశ వ్యాపారస్తులు, అసోం వంటి రాష్ట్రాల వారు కొనుగోలు చేసుకుని వారి ప్రాంతాలకు తరలిస్తుండడంతో ఇక్కడి చేపలకు భలే గిరాకీ ఏర్పడింది.

Similar News

News October 4, 2024

అధికారం పోగానే గగ్గోలు పెడుతున్న బీఆర్ఎస్ నేతలు : కోమటిరెడ్డి

image

మూసీని ప్రక్షాళన చేస్తామని జైకా నుంచి వెయ్యి కోట్లు రుణం తీసుకున్న బీఆర్ఎస్ నాయకులు.. అధికారం పోగానే మూసీ ప్రక్షాళన వద్దని గగ్గోలు పెడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం హెచ్ఐసీసీ నోవాటెల్‌లో జరిగిన “అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ 2024” కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కోమటిరెడ్డి ప్రతిపక్ష పార్టీల ద్వంద్వ విధానాలపై మండిపడ్డారు.

News October 4, 2024

NLG: పంచాయతీ ఓటర్లు@22,45,868

image

ఉమ్మడి NLG జిల్లాలో 1,768 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎన్నికల సంఘం ఇటీవల గ్రామపంచాయతీ తుది ఓటర్లు లిస్ట్ విడుదల చేసింది. 1,768 గ్రామ పంచాయతీలో 15,478 వార్డులుండగా 22,45,868 గ్రామీణ ఓటర్లు ఉన్నారు. వీరిలో థర్డ్ జెండర్ 75 మంది, 11,11,488 మంది పురుషులు, 11,34,305 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

News October 4, 2024

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 904 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 904 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. రైతులు పండించిన ధాన్యాన్ని పీఏసీఎస్, ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేయనుంది. అందుకోసం నల్గొండ జిల్లాలో 375, యాదాద్రి జిల్లాలో 323, సూర్యాపేట జిల్లాలో 206 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.