News May 18, 2024
అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యం: గోపీనాథ్ రెడ్డి
ఆంధ్ర క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యమని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఏపీఎల్ సీజన్‌పై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 30 నుంచి జూలై 13 వరకు ఈ సీజన్ కొనసాగుతుందని వివరించారు. మొత్తం 19 మ్యాచులు జరగనున్నట్లు వివరించారు. కడపలో 7, విశాఖలో 12 మ్యాచులు నిర్వహిస్తామన్నారు.
Similar News
News December 27, 2024
వాల్తేరు డీఆర్ఎంగా లలిత్ బోహ్రా
ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు పరిధిలో వాల్తేరు డివిజన్ డీఆర్ఎంగా లలిత్ బోహ్రాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రైల్వే బోర్డు నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు ఆయన న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. వాల్తేరు డీఆర్ఎంగా పనిచేసిన సౌరబ్ ప్రసాద్ లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుపడ్డారు. అప్పటినుంచి ఏడీఆర్ఎం ఇన్‌ఛార్జ్ డీఆర్ఎంగా పనిచేస్తున్నారు.
News December 27, 2024
విశాఖ: ‘నాలుగు రోజులు బ్యాంకు సేవలు నిలిపివేత’
భారత ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు ఏపీజీవీబీ ఆంధ్రా, తెలంగాణ విభాగాల విభజన దృష్ట్యా నాలుగు రోజుల పాటు బ్యాంకు సేవలను నిలిపివేస్తున్నట్లు ఏపీజీవీబీ రీజనల్ మేనేజర్ ఎస్.సతీశ్ చంద్ర తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఖాతాదారులు సహకరించాలని కోరారు. జనవరి ఒకటి నుంచి బ్యాంకు సేవలు యథాతథంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు.
News December 27, 2024
కులగణనపై సచివాలయాల పరిధిలో సామాజిక సర్వే: విశాఖ జేసీ
జిల్లాలో చేపట్టిన కులగణనను పారదర్శకంగా చేపట్టాలని విశాఖ జేసీ మయూర్ అశోక్ అధికారుల ఆదేశించారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. షెడ్యూల్ కులాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి అంశాలపై సమీక్ష చేసేందుకు, పథకాలు అమలు చేసేందుకు, మెరుగైన పాలసీ రూపకల్పన కోసం నిర్వహించిన కులగణనపై గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సామాజిక సర్వే(సోషల్ ఆడిట్)ను చేపడుతున్నట్లు వెల్లడించారు.