News May 18, 2024

BIG ALERT.. భారీ నుంచి అతిభారీ వర్షాలు

image

నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మే 24 నాటికి ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 23వ తేదీ వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని.. కోస్తాంధ్ర, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Similar News

News September 14, 2025

రోజా.. నువ్వు జబర్దస్త్‌ చేయలేదా?: దుర్గేశ్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను విమర్శించే స్థాయి వైసీపీ నేత రోజాకు లేదని మంత్రి కందుల దుర్గేశ్ ఫైర్ అయ్యారు. నువ్వు మంత్రిగా ఉండి కూడా జబర్దస్త్‌లో పాల్గొనలేదా అని ఆయన ప్రశ్నించారు. ‘పవన్‌కు డబ్బు యావ లేదు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బును కూడా ఆయన ప్రజలకే ఖర్చు చేస్తున్నారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ అయినా రాష్ట్రానికి తీసుకువచ్చారా. ప్రజా సమస్యలు తీర్చారా?’ అని ఆయన మండిపడ్డారు.

News September 14, 2025

టాస్ గెలిచిన భారత్

image

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా నేడు AUSతో భారత మహిళల జట్టు తొలి వన్డే ఆడనుంది. IND టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
IND: ప్రతీకా రావల్, మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్(C), రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి, స్నేహ్ రాణా, రాధా యాదవ్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్
AUS: అలీసా హీలీ(w/c), లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, మూనీ, అన్నాబెల్, ఆష్లీ, తహ్లియా మెక్‌గ్రాత్, జార్జియా, కింగ్, కిమ్ గార్త్, మేగాన్

News September 14, 2025

రానున్న 2-3 గంటల్లో వర్షం

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. భద్రాద్రి, HNK, HYD, BPL, JGL, JNM, KMM, ASF, మేడ్చల్, MHBD, MNCL, MUL, NLG, NRML, PDPL, రంగారెడ్డి, సంగారెడ్డి NZM, WGL జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. అటు APలోని తిరుపతి, ప.గో తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.