News May 18, 2024
BREAKING: పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేశ్ లాట్కర్

పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేశ్ లాట్కర్ నియమితులయ్యారు. ఈయన 2011 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన వ్యక్తి. ఈయన గతంలో ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ సంస్థకు, అగ్రికల్చర్ కోఆపరేషన్ డిపార్ట్‌మెంట్ ఉపాధ్యక్షుడిగా, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్‌గా పనిచేస్తుండగా.. బదిలీపై పల్నాడుకు కలెక్టర్‌గా రానున్నారు.
Similar News
News July 8, 2025
గుంటూరు జిల్లాలో ఆపరేషన్ సేవ్ క్యాంపస్ జోన్

మత్తుపదార్థాల రహిత విద్యా వాతావరణం కోసం గుంటూరు జిల్లాలో “ఆపరేషన్ సేవ్ క్యాంపస్ జోన్” స్పెషల్ డ్రైవ్ మంగళవారం ప్రారంభమైంది. ఎస్పీ సతీశ్ కుమార్ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీల సమీపంలో ఉన్న షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మత్తు పదార్థాల విక్రయంపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. సిగరెట్లు, గంజాయి విక్రయాలపై నిఘా కొనసాగుతుందని తెలిపారు.
News July 8, 2025
GNT: ‘మాజీ ఎంపీ అనుచరుడి నుంచి ప్రాణరక్షణ కల్పించండి’

లాలాపేటకు చెందిన ముజబుర్ రహమాన్, తన సోదరుడికి ప్రాణరక్షణ కల్పించాలని కోరుతూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరుడు సన్నీ, ఇసుక క్వారీ నిర్వహణకు రూ.25 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా బీహార్ గ్యాంగ్‌తో చంపిస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయమై తన సోదరుడు గతంలో ఆత్మహత్యాయత్నం చేశారని పేర్కొన్నారు.
News July 8, 2025
గుంటూరులో కూరగాయల ధరలు రెట్టింపు

గుంటూరు మార్కెట్లలో టమాటా, పచ్చిమిరప, వంకాయ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. పచ్చిమిరప కిలో రూ.80కి చేరగా, టమాటా రూ.40, వంకాయ రూ.60 పలుకుతోంది. ములక్కాయ ఒక్కటి రూ.15 నుంచి రూ.20కి పెరగడం వినియోగదారులను కుదిపేస్తోంది. డిమాండ్‌తో పోల్చితే సరఫరా తక్కువగా ఉండటం వల్లే ఈ ధరల పెరుగుదల అని వ్యాపారులు తెలిపారు. రైతుబజార్లలో కూడా ఇదే స్థితి కొనసాగుతోంది.