News May 18, 2024

సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు

image

TG: సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు సచివాలయంలో కలిశారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావ్ పటేల్, రాకేశ్ రెడ్డి సీఎంతో భేటీ అయ్యారు. ధాన్యం కొనుగోళ్లు, రైతుల సమస్యలపై చర్యలు తీసుకోవాలని వారు సీఎంను కోరారు.

Similar News

News December 26, 2024

ప్రముఖ రచయిత, డైరెక్టర్ వాసుదేవన్ కన్నుమూత

image

ప్రముఖ మలయాళ రచయిత, డైరెక్టర్ ఎంటీ వాసుదేవన్ నాయర్(91) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణం పట్ల కేరళ CM విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇవాళ, రేపు సంతాప దినాలుగా ప్రకటించారు. మలయాళ సాహిత్యంలో ఆయన కృషికిగాను 1995లో కేంద్రం జ్ఞానపీఠ అవార్డును బహూకరించింది. పలుచిత్రాలకు స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్‌గా పనిచేశారు. ఈయన ఎన్నో నవలలు, షార్ట్ స్టోరీలు రాశారు. ఆయన నాలుగు సినిమాలకు నేషనల్ అవార్డులు వచ్చాయి.

News December 26, 2024

సీఎంతో నేడు సినీ ప్రముఖుల భేటీ.. వివాదం ముగిసేనా?

image

TG: సంధ్య థియేటర్ ఘటన అనంతరం పరిణామాల నేపథ్యంలో నేడు CM రేవంత్‌తో సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. ఉ.10 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగే ఈ భేటీలో దిల్ రాజు, చిరంజీవి, వెంకటేశ్, అల్లు అరవింద్ తదితరులు పాల్గొంటారు. బన్నీ వివాదం, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. త్వరగా సమస్య సమసిపోవాలని ప్రభుత్వ పెద్దలు, సినీ స్టార్లు కోరుకుంటున్నారు.

News December 26, 2024

ఏపీలోకి జోరుగా పొరుగు రాష్ట్రాల మద్యం

image

AP: ప్రభుత్వం నూతన లిక్కర్ పాలసీ ప్రవేశపెట్టిన తర్వాత కూడా APలోకి పొరుగు రాష్ట్రాల మద్యం ఎక్కువగా వస్తోంది. ఈ ఏడాది NOV వరకు 1.89 లక్షల లీటర్ల మద్యాన్ని ఎక్సైజ్, పోలీస్ శాఖలు సీజ్ చేశాయి. ఈ నెలలో అనంతపురంలో పట్టుబడిన 30వేల బాటిళ్లనూ కలుపుకుంటే 2 లక్షల లీటర్లు దాటనుంది. ఇంకా కొన్ని బ్రాండ్ల ధరలు ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. గతేడాది ఇదే సమయానికి 71,365 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు.