News May 18, 2024

వర్షాలు.. అవసరమైతే కాల్ చేయండి

image

TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం పడటంతో డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌(డీఆర్ఎఫ్) సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లోతట్టు ప్రాంతాల్లోని నీటి నిల్వలను తొలగిస్తున్నారు. మరికొన్ని రోజులు వర్ష సూచన ఉండటంతో ప్రజల కోసం GHMC టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచింది. GHMC-DRF సహాయం కోసం 040-21111111 లేదా 9000113667కు ఫోన్ చేయాలని పేర్కొంది.

Similar News

News December 26, 2024

ఏపీలోకి జోరుగా పొరుగు రాష్ట్రాల మద్యం

image

AP: ప్రభుత్వం నూతన లిక్కర్ పాలసీ ప్రవేశపెట్టిన తర్వాత కూడా APలోకి పొరుగు రాష్ట్రాల మద్యం ఎక్కువగా వస్తోంది. ఈ ఏడాది NOV వరకు 1.89 లక్షల లీటర్ల మద్యాన్ని ఎక్సైజ్, పోలీస్ శాఖలు సీజ్ చేశాయి. ఈ నెలలో అనంతపురంలో పట్టుబడిన 30వేల బాటిళ్లనూ కలుపుకుంటే 2 లక్షల లీటర్లు దాటనుంది. ఇంకా కొన్ని బ్రాండ్ల ధరలు ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. గతేడాది ఇదే సమయానికి 71,365 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు.

News December 26, 2024

8 రోజులు.. రెండు డబుల్ సెంచరీలు, 2 శతకాలు

image

దేశవాళీ క్రికెట్‌లో సమీర్ రిజ్వీ విధ్వంసం సృష్టిస్తున్నారు. యూపీ తరఫున ఆడుతున్న అతను 8 రోజుల వ్యవధిలోనే రెండు డబుల్ సెంచరీలు, రెండు శతకాలు బాదారు. విదర్భపై 105 బంతుల్లో 202*, త్రిపురపై 97 బాల్స్‌లో 201*(ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ), హిమాచల్‌పై 153, పుదుచ్చేరిపై 137* పరుగులు చేశారు. కాగా ఐపీఎల్ వేలంలో అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం రూ.95 లక్షలకు సొంతం చేసుకుంది.

News December 26, 2024

ఇకపై అల్ట్రాటెక్ అనుబంధ సంస్థగా ICL

image

ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్(ICL)లో ప్రమోటర్లకున్న 32.72 శాతం వాటాను అల్ట్రాటెక్ సొంతం చేసుకుని కొనుగోలు ప్రక్రియను పూర్తిచేసింది. దీంతో అల్ట్రాటెక్ వాటా 55.49 శాతానికి చేరుకుంది. దీంతో ఇండియా సిమెంట్స్ ఎండీ శ్రీనివాసన్, భార్య చిత్ర, కుమార్తె రూప, ఇతర ప్రమోటర్లు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఇకపై సదరు సంస్థ తమకు అనుబంధంగా కొనసాగుతుందని అల్ట్రాటెక్ వెల్లడించింది.