News May 18, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ కు CPI(M) మద్దతు!

image

ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి CPI(M) పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం అధికారిక ప్రకటన చేశారు. WGL-NLG-KMM ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెసుకు మద్దతు ఇవ్వాలని CPI(M) నిర్ణయించిందని తెలిపారు. బిజెపిని ఓడించడం కోసం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతు ప్రకటించారు.

Similar News

News January 6, 2026

హెల్మెట్‌ లేదంటే.. చుక్క పెట్రోల్‌ పోయరు: నల్గొండ ఎస్పీ

image

ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం జిల్లా పోలీస్‌ శాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం నుంచి జిల్లావ్యాప్తంగా ‘నో హెల్మెట్‌ – నో పెట్రోల్‌’ నిబంధన అమలు చేయనున్నట్లు ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ వెల్లడించారు. హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ పోయరాదని ఇప్పటికే అన్ని బంకు యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.

News January 6, 2026

NLG: తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

image

కారు, బొలెరో ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. నల్గొండ జిల్లా గుడిపల్లి మండలం చిలకమర్రి వద్ద KDD-జడ్చర్ల రహదారిపై ఈ ఘటన జరిగింది. మృతుడు పెద్ద అడిశర్లపల్లి మండలం దుగ్యాలకి చెందిన మారుపాక గణేష్‌గా గుర్తించారు. గణేష్ అంగడిపేట ఎక్స్ రోడ్డులోని పెట్రోల్ బంకులో పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 6, 2026

NLG: ట్రాన్స్ జెండర్లకు గుడ్ న్యూస్

image

ట్రాన్స్‌జెండర్ల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం ‘ఉపాధి పునరావాస పథకాన్ని’ ప్రవేశపెట్టిందని జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి తెలిపారు. వ్యవసాయం, వ్యాపారం లేదా సేవా రంగాల్లో స్వయం ఉపాధి పొందాలనుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. అర్హులైన వారు ఈ నెల 12వ తేదీలోపు జిల్లా సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీని ద్వారా ట్రాన్స్ జెండర్లు గౌరవప్రదమైన జీవనం గడపవచ్చన్నారు.