News May 18, 2024
అల్లర్లకు చంద్రబాబే బాధ్యుడు: జోగి

AP: ఓటమి భయంతోనే వైసీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ చీఫ్ చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు. ‘ఎన్నికలు ముగిసినా వైసీపీ నేతలపై దాడులు ఆగటం లేదు. ప్రణాళికా బద్ధంగా మా పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారు. అమాయక ప్రజలను పొట్టనబెట్టుకుంటూ రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తున్నారు. అల్లర్లు, దాడులకు చంద్రబాబే బాధ్యుడు. ఫలితాల తర్వాత బాబు పారిపోవటం ఖాయం’ అని ఆయన మండిపడ్డారు.
Similar News
News January 20, 2026
సిట్ ఎన్నిసార్లు పిలిచినా వెళ్తా: హరీశ్ రావు

TG: సిట్ ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వెళ్తానని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ‘విచారణకు పిలిచి గంట ప్రశ్నలు అడగడం.. కాసేపు ఫోన్ వచ్చిందని బయటకు వెళ్లడం చేశారు. కోల్ మైన్ విషయంలో రేవంత్, భట్టి, కోమటిరెడ్డి మధ్య పంపకాల్లో తేడా వచ్చింది. ఈ అంశం డైవర్ట్ చేయడానికే డ్రామా ఆడుతున్నారు. దర్యాప్తు పేరుతో ఆడుతున్న నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారు. సీఎం రేవంత్ భాష వింటే రోత పుడుతోంది’ అని ఆయన అన్నారు.
News January 20, 2026
నం.3లో ఇషాన్ కిషన్ ఆడతారు: సూర్య

రేపు NZతో జరిగే తొలి T20లో ఇషాన్ కిషన్ నం.3లో బ్యాటింగ్ చేస్తారని కెప్టెన్ SKY తెలిపారు. శ్రేయస్ కంటే ముందే బ్యాటింగ్ చేయడానికి అతను అర్హుడన్నారు. మరోవైపు తన ఆటతీరులో మార్పు ఉండదని, గతంలో మాదిరే బ్యాటింగ్ చేయాలనుకుంటున్నానని చెప్పారు. రేపటి నుంచి NZతో IND 5 మ్యాచుల సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లో 7PMకు ప్రారంభమవుతుంది. JIO హాట్‌స్టార్, స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో LIVE చూడొచ్చు.
News January 20, 2026
APలో RMZ సంస్థ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు!

AP: రాష్ట్రంలో భారీగా పెట్టుబడులకు RMZ సంస్థ ముందుకొచ్చింది. రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు సంస్థ ఛైర్మన్ మనోజ్ మెండా తెలిపారు. దావోస్ సమ్మిట్‌లో మంత్రి లోకేశ్‌తో సమావేశం అనంతరం ఈ ప్రకటన చేశారు. విశాఖ కాపులుప్పాడ ఫేజ్-1 ఐటీ పార్క్‌లో 50 ఎకరాల్లో జీసీసీ పార్క్ అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. 1Gw వరకు హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ప్లాన్లు రెడీ చేస్తున్నామని పేర్కొన్నారు.


