News May 18, 2024
సాగునీటి శాఖపై సీఎం రేవంత్ సమీక్ష
TG: కాళేశ్వరం ప్రాజెక్టు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. NDSA ఇచ్చిన నివేదిక విషయంలో తీసుకోవాల్సిన చర్యలు, మేడిగడ్డ మరమ్మతులు, నిధుల చెల్లింపు అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ పాల్గొన్నారు.
Similar News
News December 23, 2024
నేడు కృష్ణా జిల్లాలో పవన్ పర్యటన
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కంకిపాడు మండలం గుడువర్రులో పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. అనంతరం గుడివాడ మండలంలోని మల్లయ్యపాలెంలో రక్షిత తాగు నీటి పథకానికి సంబంధించిన కార్యక్రమాల గురించి అధికారులతో చర్చిస్తారు.
News December 23, 2024
భారత జట్టు అరుదైన ఘనత
క్రికెట్‌లో భారత మెన్స్, ఉమెన్స్ జట్లు అరుదైన ఘనత సాధించాయి. టీ20 ఫార్మాట్‌లో వరల్డ్ కప్, ఆసియా కప్ ప్రారంభించిన తొలి ఏడాదే 3 సార్లు ట్రోఫీ అందుకున్నాయి. 2007లో టీ20 మెన్స్ వరల్డ్ కప్, 2023లో అండర్-19 ఉమెన్స్ T20WC, ఈ ఏడాది U-19 ఉమెన్స్ ఆసియా కప్‌లను సొంతం చేసుకున్నాయి. నిన్న జరిగిన U-19 ఆసియా కప్ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను 41 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది.
News December 23, 2024
సుమతీ నీతి పద్యం- తాత్పర్యం
ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పలుగజెఱువు నిండిన
గప్పలు పదివేలుజేరుగదరా సుమతీ!
తాత్పర్యం: చెరువు నిండా నీరు ఉన్నప్పుడు వేలకొద్దీ కప్పలు అక్కడికి చేరుకుంటాయి. అలాగే మనకు ఎప్పుడైతే సంపద చేకూరుతుందో అప్పుడు బంధువులు వస్తారు.