News May 18, 2024
భార్య కాపురానికి రావడంలేదని భర్త సూసైడ్

భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపానికి గురై భర్త ఆత్మహత్మ చేసుకున్నాడు. నిడదవోలు మండలం తాడిమల్లకు చెందిన దిరిసిమిల్లి పోతురాజు(47) శనివారం పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు. భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా కొద్దిరోజులుగా విడిగా జీవనం సాగిస్తున్నారన్నారు. పోతురాజు ఆత్మహత్యకు పాల్పడినట్లు భార్య నాగలక్ష్మి ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News December 29, 2025
రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి: జేసీ

రబీ సాగులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగినంత యూరియా అందుబాటులో ఉంచాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్ నుండి రైతు ప్రతినిధులు, అధికారులతో గూగుల్ మీట్ ద్వారా ఆయన సమీక్షించారు. అన్ని మండలాల్లో అవసరమైన మేర నిల్వలు ఉండేలా చూడాలని, పంపిణీలో పారదర్శకత పాటించాలని సూచించారు. సాగు అవసరాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News December 29, 2025
SP హెచ్చరిక.. నిబంధనల మధ్యే న్యూ ఇయర్‌కి స్వాగతం

నూతన సంవత్సర వేడుకలను పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సూచించారు. వేడుకల పేరుతో రోడ్లపై హంగామా చేసినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ నిఘా ఏర్పాటు చేశామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని స్పష్టం చేశారు. నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు.
News December 29, 2025
కలెక్టర్‌కి పదోన్నతి.. అధికారుల అభినందనల వెల్లువ

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి కార్యదర్శిగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సోమవారం పీజీఆర్ సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. డీఆర్వో శివనారాయణ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు కలెక్టర్‌ను కలిసి అభినందనలు తెలియజేశారు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.


