News May 18, 2024
రాణించిన బ్యాటర్లు.. RCB భారీ స్కోర్
CSKతో మ్యాచ్‌లో ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లు ఆడి 218/5 పరుగులు చేసింది. జట్టులో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (54), విరాట్ కోహ్లీ (47), రజత్ పాటీదార్ (41), గ్రీన్ (38) రాణించడంతో భారీ స్కోరు సాధ్యమైంది. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టారు. తుషార్ దేశ్‌పాండే, శాంట్నర్ చెరో వికెట్ తీశారు. చెన్నై టార్గెట్ 219 కాగా.. 201 రన్స్ చేసినా ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరుతుంది.
Similar News
News December 27, 2024
సుమతీ నీతి పద్యం- తాత్పర్యం
అక్కఱకు రాని చుట్టము
మ్రొక్కిన వర మీని వేల్పు మోహరమునదా
నెక్కినబారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగవలయుగదరా సుమతీ!
తాత్పర్యం: అవసరానికి పనికిరాని బంధువును, నమస్కరించి వేడుకున్నా కోరిక నెరవేర్చని భగవంతుని, యుద్ధంలో ముందుకు పరిగెత్తని గుర్రాన్ని వెంటనే విడిచిపెట్టవలెను.
News December 27, 2024
6 నెలల్లోనే ప్రజలపై రూ.15,485 కోట్ల భారం: మేరుగు
AP: అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచకుండా తగ్గిస్తామని చంద్రబాబు మాయమాటలు చెప్పారని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఫైరయ్యారు. ఇప్పుడు ఆయన నిజస్వరూపాన్ని బయటపెట్టారని దుయ్యబట్టారు. ప్రజలపై 6 నెలల్లోనే రూ.15,485 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారని మండిపడ్డారు. కూటమి పాలన బాదుడే బాదుడుగా ఉందని ఎద్దేవా చేశారు. కరెంట్ ఛార్జీల భారాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
News December 27, 2024
డిసెంబర్ 27: చరిత్రలో ఈరోజు
✒ 1822: రేబిస్ టీకా సృష్టికర్త లూయీ పాశ్చర్ జననం
✒ 1911: కలకత్తా కాంగ్రెస్ సభలో తొలిసారిగా జనగణమన ఆలాపన
✒ 1939: టర్కీలో భూకంపం, 32 వేలమంది మృతి
✒ 1945: అంతర్జాతీయ ద్రవ్య నిధి స్థాపన
✒ 1965: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జననం
✒ 2007: పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య
✒ 2009: నటుడు నర్రా వెంకటేశ్వరరావు కన్నుమూత