News May 18, 2024
‘SSMB 29’లో విలన్‌గా పృథ్వీరాజ్?
మహేశ్ బాబు హీరోగా ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న మూవీలో మళయాల నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆయన విలన్ పాత్ర పోషించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రాజమౌళి తెరకెక్కించనున్న ఈ మూవీలో ఇండోనేషియా హీరోయిన్ చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ నటించనున్నట్లు టాక్. కీరవాణి సంగీతం అందించనున్నారు. కేఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
Similar News
News December 26, 2024
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అస్వస్థత
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 26, 2024
పెళ్లంటే భయం.. రొమాన్స్ అంటే ఇష్టం: శృతి హాసన్
తన వివాహం గురించి హీరోయిన్ శృతి హాసన్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఆమె తన ప్రియుడు శాంతనుతో వివాహం చేసుకుంటారని వార్తలు రాగా దీనిని ఆమె ఖండించారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో అడగటం ఇక ఆపేయండంటూ సూచించారు. ‘నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ రిలేషన్‌లో ఉండేందుకు ఇష్టపడతా. నాకు రొమాన్స్ అంటే ఇష్టం. ఒకరితో నన్ను నేను ఎక్కువగా అటాచ్ చేసుకోవాలంటే కొంచెం భయంగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.
News December 26, 2024
పిల్లలకు చదువుతోపాటు వీటిని నేర్పిస్తున్నారా?
పిల్లలు జీవితంలో సక్సెస్ కావాలంటే ఐదు ఆధ్యాత్మిక అంశాలు నేర్పాలి. పిల్లలను కృతజ్ఞతాభావంతో పెంచాలి. ఎవరైనా సాయం చేసినప్పుడు వారికి కృతజ్ఞతలు చెప్పించాలి. చిన్నతనం నుంచే మనుషులు, మొక్కలు, జంతువులపై దయ ఉండేలా మలచాలి. చిన్నారుల్లో పరధ్యానం పోగొట్టడానికి ఏకాగ్రత అలవర్చాలి. క్షమాగుణం కూడా అలవాటు చేయాలి. ఎవరైనా తప్పు చేసినా పగ తీర్చుకోకుండా క్షమించడాన్ని నేర్పాలి. ఆధ్యాత్మికతపై వారిలో ఆసక్తిని పెంచాలి.