News May 19, 2024
తిరుమలలో కనుల పండువగా పద్మావతి పరిణయోత్సవాలు
AP: తిరుమలలో పద్మావతి పరిణయోత్సలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం శ్రీమలయప్పస్వామి అశ్వవాహనాన్ని అధిరోహించి బయలుదేరగా.. ఆయన వెంట స్వర్ణపల్లకీలో శ్రీదేవి, భూదేవి అనుసరిస్తూ నారాయణగిరి ఉద్యానానికి చేరుకున్నారు. అనంతరం బంగారు తిరుచ్చిపై తిరువీధుల గుండా ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు.
Similar News
News December 23, 2024
పెట్రోల్ పంపులో దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ఉపాధి
TG: దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం వినూత్న నిర్ణయం తీసుకుంది. సిరిసిల్ల రెండో బైపాస్ రోడ్డు వద్ద ఓ ప్రత్యేక పెట్రోల్ పంపును ఏర్పాటు చేసి 24 మందికి ఉపాధినిచ్చింది. 24/7 పనిచేసే ఈ పంపులో రోజుకు ₹లక్ష విలువైన ఇంధనం సేల్ అవుతోంది. దేశంలో దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ల కోసం పెట్రోల్ పంపు ఏర్పాటు చేయడం దేశంలో ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు.
News December 23, 2024
శ్రీతేజ్ కోసం రూ.2 కోట్లతో అల్లు అర్జున్ ట్రస్టు?
TG: సంధ్య థియేటర్ ఘటనలో ప్రాణాలతో పోరాడుతున్న శ్రీతేజ్ కోసం అల్లు అర్జున్ ఓ ట్రస్టు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. బన్నీ, సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి దాదాపు రూ.2 కోట్లను ట్రస్టులో జమచేస్తారని తెలుస్తోంది. ఈ మొత్తాన్ని అతని వైద్యం, భవిష్యత్తు కోసం ఖర్చు చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
News December 23, 2024
బన్నీ బెయిల్ రద్దు కోసం నేడు పిటిషన్?
TG: సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ విలేకరులతో మాట్లాడటాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. అతని బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారట. ఈ కేసులో అరెస్టైన బన్నీకి హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.