News May 19, 2024
ఉమ్మడి గుంటూరు జిల్లాలో భార్యా భర్తకు పోస్టింగ్

ఆ భార్యాభర్తలు ఐపీయస్ అధికారులు.. వీరిద్దరిని కూడా అదే ఉమ్మడి జిల్లాలో ఎస్‌పీలుగా ప్రభుత్వం నియమించింది. వారే పల్నాడు, బాపట్ల జిల్లాల ఎస్‌పీలుగా భార్య భర్తలు మల్లిక గర్గ్, వకుల్ జిందాల్‌లు. భార్యా భర్తలు ఇద్దరూ అఖిల భారత సర్వీసుల అధికారులైతే వేర్వేరు ప్రాంతాల్లో కొలువు తప్పదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోనే ఇద్దరికి పోస్టింగ్ రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
Similar News
News April 23, 2025
పదో తరగతి పరీక్షల్లో ఆటో డ్రైవర్ కుమార్తె టాపర్

తెనాలి(M) సంగం జాగర్లమూడి గ్రామానికి చెందిన మద్దినేని మనోజ్ఞ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో సత్తా చాటింది. గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో చదువుతున్న మనోజ్ఞ 591 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో టాపర్‌గా నిలిచారు. సర్కార్ బడిలో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన మనోజ్ఞను పలువురు అభినందించారు. మనోజ్ఞ తండ్రి మధుబాబు ఆటో డ్రైవర్ వృత్తిలో ఉన్నారు. ఐఐటీలో చదవాలన్నది తన లక్ష్యమని మనోజ్ఞ తెలిపారు.
News April 23, 2025
టెన్త్ ఫలితాల్లో అద్భుతంగా రాణించిన గుంటూరు

గుంటూరు జిల్లా పదో తరగతి పరీక్షల్లో అద్భుతంగా రాణించింది. రెగ్యులర్ విద్యార్థులలో 27,255 మంది పరీక్ష రాయగా, 24,169 మంది ఉత్తీర్ణత సాధించి 88.53 శాతంతో రాష్ట్రంలో నాలుగవ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది ఉత్తీర్ణత 86.69శాతంతో 16వ స్థానంలో నిలిచింది. ఈసారి ఏకంగా 12 స్థానాలు మెరుగుపర్చుకుని 4వ స్థానంలో నిలవడం విశేషం.
News April 23, 2025
10th RESULTS: 4వ స్థానంలో గుంటూరు జిల్లా

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 27,255 మంది పరీక్ష రాయగా 24,129 మంది పాసయ్యారు. 14444 మంది బాలురులో 12567 మంది, 12811 మంది బాలికలు పరీక్ష రాయగా 11562 మంది పాసయ్యారు. 88.53 పాస్ పర్సంటైల్‌తో జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది.