News May 19, 2024

అకౌంట్లలోకి ‘చేయూత’ స్కీమ్ నగదు

image

AP: వైఎస్సార్ చేయూత పథకం నిధులను ప్రభుత్వం లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ స్కీమ్ కింద రూ.5065 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.1552.32 కోట్ల నిధులను విడుదల చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా రూ.3512.68 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ పథకం కింద 45-60 ఏళ్ల మధ్య వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 ఆర్థిక సాయం అందిస్తున్నారు. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?

Similar News

News December 26, 2024

ఆ కారణం వల్లే మహాత్మాగాంధీ హత్య: సోనియా

image

పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఐకమత్యంగా ముందుకు సాగుదామని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ బెలగావి సభలో నేతలకు ఓ సందేశంలో తెలిపారు. ‘స్వాతంత్ర్యం కోసం ఎలాంటి పోరాటమూ చేయని సంస్థలు మహాత్మాగాంధీని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఒక విషతుల్యమైన వాతావరణాన్ని క్రియేట్ చేశాయి. వాటి వల్లే ఆయన హత్య జరిగింది. కేంద్రంలో అధికారానికి వచ్చిన వారి వల్ల గాంధీ ఘనత ప్రమాదంలో పడింది’ అన్నారు.

News December 26, 2024

షేక్ హసీనా భవిష్యత్తు ఎటు?

image

భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా భవితవ్యం ఆసక్తికరంగా మారింది. యూనస్ సర్కారు ఆమెను అప్పగించాలని భారత్‌ను అడిగిన నేపథ్యంలో హసీనా పూర్తిగా భారత్‌ దయపై ఆధారపడ్డారు. శరణార్థుల అప్పగింత ఒప్పందం ప్రకారం హసీనాను భారత్ అప్పగించాల్సి ఉన్నా.. యూనస్‌ భారత వ్యతిరేక వైఖరి కారణంగా హసీనాకు రక్షణ కల్పించేందుకే భారత్ నిర్ణయించుకునే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

News December 26, 2024

జైల్లో అల్లర్లు: 1500మంది పరారీ.. 33మంది మృతి

image

మొజాంబిక్‌ రాజధాని మపూటోలోని ఓ జైల్లో తాజాగా చెలరేగిన అల్లర్లలో 1534మంది క్రిమినల్స్ జైలు నుంచి పరారు కాగా 33మంది మృతిచెందారు. 15మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎన్నికల్లో అధికార పార్టీదే విజయమని ఆ దేశ సుప్రీం కోర్టు ప్రకటించడంతో ప్రతిపక్షాలు మొదలుపెట్టిన అల్లర్లు జైలు వరకూ విస్తరించాయి. 150మందిని తిరిగి పట్టుకున్నామని, మిగిలిన ఖైదీల కోసం గాలింపు చేపట్టామని అధికారులు తెలిపారు.