News May 19, 2024

IPL.. అదరగొట్టిన RCB

image

ఈ సీజన్ IPLలో RCB అద్భుతమైన ఆటతీరు కనబరిచింది. ఓ దశలో టేబుల్‌లో లాస్ట్ ప్లేస్. మైనస్ రన్‌రేట్. ప్లేఆఫ్స్‌కు వెళ్లేందుకు 1% అవకాశం. బెంగళూరు కథ ముగిసినట్లేనని అంతా భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా పుంజుకుని విజయాలవైపు అడుగులు వేసింది. కనీవినీ ఎరుగని రీతిలో, అభిమానులు సైతం ఆశ్చర్యపోయేలా వరుసగా 6 మ్యాచ్‌లలో విజయాలు సాధించింది. 14 పాయింట్లతో CSKతో సమంగా నిలిచి.. మంచి రన్‌రేట్‌తో ప్లేఆఫ్స్‌కు వెళ్లింది.

Similar News

News December 27, 2024

సీఎం-సినీ ప్రముఖుల భేటీపై పూనమ్ కౌర్ ట్వీట్

image

సీఎం రేవంత్ రెడ్డి, సినీ ప్రముఖుల భేటీపై హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించారు. ‘ఈ మీటింగ్‌ను చూస్తే ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి సమస్యలు లేవని తెలుస్తోంది. హీరోలకు ఏవైనా వ్యాపార సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ఇండస్ట్రీ అండగా ఉంటుంది’ అని ఆమె సెటైర్ వేశారు. ఇవాళ సీఎంతో జరిగిన భేటీలో ఇండస్ట్రీ నుంచి ఒక్క నటి కానీ మహిళా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కానీ ఎవరూ పాల్గొనలేదు. దీనిని ఉద్దేశించే ఆమె ట్వీట్ చేశారు.

News December 27, 2024

ఆస్పత్రి నుంచి అద్వానీ డిశ్చార్జి

image

బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ (97) ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన కోలుకుని ఆరోగ్యంగా ఉండటంతో వైద్యులు ఇంటికి పంపారు. కాగా కొద్ది రోజులుగా అద్వానీ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 12న ఆయన ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. డా.వినీత్ సూరి ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స అందించగా పూర్తిగా కోలుకున్నారు.

News December 27, 2024

ఆస్పత్రిలో మన్మోహన్ సింగ్.. చివరి ఫొటో

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. ఆయన ఆస్పత్రిలో ఉన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తలపాగా, గడ్డం లేకుండా ఆయన కనిపించారు. కాగా మన్మోహన్ కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు.