News May 19, 2024

TPT: పెళ్లి చూపుల కోసం వస్తూ చనిపోయాడు

image

చంద్రగిరి సమీపంలో ఐతేపల్లి వద్ద నిన్న ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకరు <<13272611>>చనిపోయిన <<>>విషయం తెలిసిందే. మృతుడు రేణిగుంట మండలం ఆర్.మల్లవరానికి చెందిన సందీప్‌గా గుర్తించారు. తల్లిదండ్రుల కోరిక మేరకు అమెరికాలో ఉద్యోగం మానేసి బెంగళూరుకు వచ్చి సాప్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు. పెళ్లిచూపులు ఉన్నాయని తల్లిదండ్రులు చెప్పడంతో కారులో ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొనడంతో చనిపోయాడు.

Similar News

News January 12, 2026

చిత్తూరులో ఘనంగా వివేకానంద జయంతి

image

చిత్తూరులోని వివేకానంద పార్కులో స్వామి వివేకానంద జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పలువురు నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే తండ్రి చెన్నకేశవుల నాయుడు హాజరయ్యారు. ఆయన పలువురికి హిందూ సమ్మేళన పురస్కారాలను పంపిణీ చేశారు. వివేకానందుడు చూపిన మార్గం యువతకు ఆదర్శనీయమని కొనియాడారు.

News January 12, 2026

చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజేంద్రన్

image

చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజేంద్రన్‌ను నియమిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన చిత్తూరుకు బదిలీ అయ్యారు. చిత్తూరులో JC విద్యాధరి విశాఖపట్నం జాయింట్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.

News January 12, 2026

GDనెల్లూరు: CHC పూర్తయితే కష్టాలు తీరేనా.?

image

కార్వేటినగరం PHCలో ఇద్దరు డాక్టర్లు, నలుగురు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్ట్, హెల్త్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్నారు. 50 పడకల CHC పూర్తయితే సివిల్ సర్జన్లు, మెడికల్ ఆఫీసర్లు, గైనకాలజిస్ట్, పీడియాట్రీషియన్, అనస్థీషియా నిపుణులు అందుబాటులో ఉండనున్నారు. ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, క్లాస్–4 సిబ్బంది అందుబాటులోకి రావడంతో వైద్య సేవలు మెరుగుపడతాయని స్థానికులు అంటున్నారు.