News May 19, 2024
రాష్ట్రంలోనే అతి పెద్ద మెగా ఫుడ్ పార్క్.. జూన్‌లో ప్రారంభం
TG: రాష్ట్రంలోనే అతి పెద్దదైన, ప్రభుత్వ రంగంలో తొలి మెగా ఫుడ్ పార్క్ ఖమ్మంలోని బుగ్గపాడులో ఏర్పాటైంది. దాదాపు 200ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కును వచ్చే నెలలో ప్రారంభించనున్నారు. రైతులు, వ్యాపారులు, ఎగుమతి దారులు, పారిశ్రామిక వేత్తల కార్యకలాపాలకు ఇది వేదిక కానుంది. ఇందులో వివిధ కంపెనీలతో ఆహారశుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ద్వారా 25వేల మందికి ఉపాధి లభించనుంది.
Similar News
News December 23, 2024
రేవతి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని TFCC నిర్ణయం
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌కు అండగా ఉంటామని తెలిపింది. వారి కుటుంబానికి సాయం చేసేందుకు మనీ డొనేట్ చేయాలని ఛాంబర్ మెంబర్లను కోరుతూ సర్క్యులర్ జారీ చేసింది.
News December 23, 2024
తప్పు చేసిన ఎవరినీ వదలం: మంత్రి కొల్లు రవీంద్ర
AP: మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం మాయం చేసింది వాస్తవం కాదా? అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. దారి మళ్లిన బియ్యం స్కామ్‌పై వివరణ ఇచ్చుకోలేని దుస్థితి ఆయనది అని ఎద్దేవా చేశారు. తప్పు చేయనప్పుడు దొంగలా తప్పించుకొని తిరగడమెందుకని నిలదీశారు. తప్పు చేసిన ఎవరినీ వదలబోమని చెప్పారు. రేషన్ కుంభకోణంపై సిట్ ఏర్పాటుకు సిఫార్సు చేస్తామని, విచారణలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలుంటాయన్నారు.
News December 23, 2024
అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయించింది కాంగ్రెస్సే: బీఆర్ఎస్
TG: అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన ముఠాను KTR పంపారని ప్రచారం చేస్తున్న వారిపై BRS మండిపడింది. ‘గూండాలతో అల్లు అర్జున్ ఇంటిపై దాడులు చేయించి కాంగ్రెస్ పార్టీ అడ్డంగా దొరికిపోయింది. ఇప్పుడు ప్రజల దృష్టి మరల్చేందుకు ఫేక్ ఎడిట్లతో ముందుకు వచ్చింది. రేవంత్ సర్కార్ డైవర్షన్ రాజకీయాలతో కాలం గడుపుతోంది. ఫేక్ ఎడిట్లు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని X వేదికగా హెచ్చరించింది.