News May 19, 2024
ప.గో.: మరో 15 రోజులే.. మీ MLA ఎవరు..?

ఎన్నికల ఫలితాలు మరో 15రోజుల్లో వెలువడనున్నాయి. ఎక్కడ ఎవరు MLA అనేది తేలనుంది. అంతలోనే నియోజకవర్గాల్లో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. అభ్యర్థులు గెలుపోటములు, మెజారిటీలపై పందేలు కాస్తున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారం రూ.లక్షల్లో సాగుతుందని టాక్. మరోవైపు పలుపార్టీల నేతలు ప్రజలను ఎప్పటికప్పుడు ఓటు ఎవరికి వేశారన్నదానిపై ఆరా తీస్తూ అంచనాలు వేస్తున్నారు.
– మరి మీ MLA ఎవరవుతారు..? తాజా పరిస్థితి ఏంటి..?
Similar News
News January 30, 2026
ప.గో: వశిష్ఠ గోదావరి తీరంలో మృతదేహం కలకలం

నరసాపురం పట్టణంలోని వశిష్ఠ గోదావరి తీరం లలిత ఘాట్ సమీపంలో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని మగ మృతదేహం లభ్యమైంది. నది ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఈ మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి ఉండటంతో, సదరు వ్యక్తి రెండు, మూడు రోజుల క్రితమే నీటిలో మునిగి మృతి చెంది ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి గుర్తింపు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
News January 30, 2026
ప.గో: పాత కక్షలతో ఇరు వర్గాల ఘర్షణ.. 13 మందిపై కేసు!

అత్తిలి మండలంలోని ఎర్ర నీలిగుంట గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో పెచ్చేటి శ్రీనివాసరావు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ కలకలం రేపింది. ఈ నెల 28న ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు దిగగా, బాధితుల ఫిర్యాదు మేరకు మొత్తం 13 మందిపై కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు నిఘా పెంచారు. కక్షలు వీడి సామరస్యంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
News January 30, 2026
కుష్టు నివారణే లక్ష్యంగా ‘స్పర్శ’ అవగాహన: కలెక్టర్

గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకొని ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు జిల్లావ్యాప్తంగా కుష్టు వ్యాధి నివారణ పక్షోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ‘స్పర్శ’ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో సర్పంచ్‌లు, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది ప్రతిజ్ఞ చేయాలని ఆదేశించారు. వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించి, కుష్టు రహిత సమాజం కోసం కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.


