News May 19, 2024

‘కంగువా’ మూవీ రిలీజ్ డేట్ లాక్?

image

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘కంగువా’ మూవీ విడుదల తేదీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ చివరి వారంలో కానీ నవంబర్ 1న కానీ విడుదల చేయనున్నట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. సిరుతై శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు.

Similar News

News December 23, 2024

KL రాహుల్ రికార్డు సృష్టిస్తాడా?

image

IND బ్యాటర్ KL రాహుల్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. BGT నాలుగో టెస్టులో సెంచరీ చేస్తే వరుసగా 3 బాక్సింగ్ డే టెస్టుల్లో సెంచరీలు (హ్యాట్రిక్) చేసిన తొలి ప్లేయర్‌గా నిలుస్తారు. గత 2 బాక్సింగ్ డే టెస్టుల్లో (vsసౌతాఫ్రికా 2021, 2023) ఆయన సెంచరీలు చేశారు. అంతకుముందు 2014లో AUSతో బాక్సింగ్ డే టెస్టులో విఫలమయ్యారు. దీంతో ఈనెల 26 నుంచి ప్రారంభమయ్యే టెస్టులో సెంచరీ చేస్తారా అనే దానిపై ఆసక్తి నెలకొంది.

News December 23, 2024

మతం పేరిట జరుగుతున్న దారుణాలకు అదే కారణం: మోహన్ భాగవత్

image

ప్రపంచవ్యాప్తంగా మతం పేరిట జరుగుతున్న దారుణాలన్నింటికి మతాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడమే కారణమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. మతం గురించి సరైన జ్ఞానం, అవగాహన లేకపోవడం వల్లే దారుణాలు జరుగుతున్నాయని ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ప్రతిదీ ధర్మం ప్రకారమే పనిచేస్తుందని, అందుకే దీనిని “సనాతన్” అని పిలుస్తారని పేర్కొన్నారు. ధర్మం గురించి సరిగ్గా బోధించాల్సిన అవసరం ఉందన్నారు.

News December 23, 2024

ఆ ఆలోచనతోనే సీఎం మాట్లాడారు: శ్రీధర్ బాబు

image

TG: అల్లు అర్జున్ వివాదంపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమన్నారు. అభిమానులు థియేటర్‌కు వచ్చి చనిపోవడం సరికాదని CM అన్నారని తెలిపారు. బాధిత కుటుంబానికి ధైర్యమివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆ ఆలోచనతోనే CM మాట్లాడారని.. తాము సినీ ఇండస్ట్రీని భయపెడుతున్నామనే దాంట్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఘటనను రాజకీయం చేసే వారి గురించి మాట్లాడబోమని చెప్పారు.