News May 19, 2024

పోస్టింగ్ ఇప్పించాలని AB వెంకటేశ్వరరావు లేఖ

image

AP: కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ <<13207718>>తీర్పు<<>> ప్రకారం తనకు పోస్టింగ్ ఇప్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. తనకు పోస్టింగ్ ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని.. ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న తనకు న్యాయం చేయాలని కోరారు. తన సస్పెన్షన్ చెల్లదంటూ CAT ఇటీవల ఇచ్చిన తీర్పు కాపీని అందించారు. ఈ లేఖను CECకి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పంపారు.

Similar News

News January 7, 2026

డబ్బు ముందు ‘బంధం’ ఓడిపోయింది!

image

పోయే ఊపిరి నిలవాలంటే డబ్బే కావాలి అన్నాడు ఓ కవి. కానీ ఆ డబ్బుల కోసం కొందరు సొంత బంధాలను తెంచుకుంటున్నారు. నిజామాబాద్‌లో ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన ఘటనలో సంచలన విషయం వెలుగుచూసింది. రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం పక్కా ప్లాన్‌తో భర్తను హతమార్చినట్లు విచారణలో తేలింది. అంతకుముందు KNRలోనూ ఇన్సూరెన్స్ డబ్బులు కోసం అన్నను తమ్ముడు హతమార్చిన ఘటన మనుషుల మధ్య సంబంధాలను కాలరాస్తున్నాయి.

News January 7, 2026

ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా?

image

ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం మంచిది కాదని వైద్యులు చె‌బుతున్నారు. ‘అలా చేస్తే కడుపులోని జీర్ణ రసాలు పలుచబడతాయి. దీంతో ఫుడ్ సరిగా జీర్ణం కాదు. ఫలితంగా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. నీటి అధిక పరిమాణం కడుపులో ఒత్తిడిని పెంచి, ఆహారాన్ని అరిగించాల్సిన యాసిడ్‌ను అన్నవాహికలోకి నెడుతుంది. ఫలితంగా గుండెల్లో మంటకు కారణమవుతుంది. అందుకే తిన్న తర్వాత 30-60 నిమిషాలు ఆగి వాటర్ తాగాలి’ అని సూచిస్తున్నారు.

News January 7, 2026

గాయం నుంచి కోలుకొని అదరగొట్టిన శ్రేయస్

image

భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ VHTలో అదరగొట్టారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత నిన్న ముంబై కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడిన ఆయన 53 బంతుల్లోనే 82 రన్స్ చేశారు. అందులో 10 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. దీంతో ఈ నెల 11 నుంచి NZతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో శ్రేయస్ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకోవడం ఖాయమైనట్లే. గతేడాది AUSలో వన్డే మ్యాచ్ ఆడుతూ గాయపడిన శ్రేయస్ 2 నెలల పాటు ఆటకు దూరమైన విషయం తెలిసిందే.