News May 19, 2024

సాంకేతిక లోపం.. అకౌంట్లో ₹9,999 కోట్లు

image

బ్యాంక్ తప్పిదం వల్ల ఓ వ్యక్తి ఖాతాలో ఏకంగా ₹9,999 కోట్లు దర్శనమిచ్చాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదోహీ జిల్లాలో భాను ప్రకాశ్ అనే వ్యక్తికి బరోడా యూపీ బ్యాంక్‌లో కిసాన్ క్రిడెట్ కార్డు లోన్ అకౌంట్ ఉంది. అతడు బ్యాలెన్స్ చెక్ చేసుకోగా ఒక్కసారిగా ₹99,99,94,95,999.99 దర్శనమివ్వడంతో ఆశ్చర్యపోయారు. వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వడంతో అకౌంట్ NPAగా మారి సాంకేతిక లోపంతో అంత మొత్తం చూపించిందని వివరించారు.

Similar News

News January 8, 2026

తీగ చిక్కుడులో ఆముదం మొక్కలతో ఏమిటి ప్రయోజనం?

image

తీగ చిక్కుడు పంటను సాగు చేసే కొందరు రైతులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఆముదం మొక్కలను తీగ చిక్కుడు పంటలోని ప్రతి ఆరు అడుగులకు ఒకటి చొప్పున నాటుతున్నారు. దీని వల్ల చీడపీడల సమస్య తగ్గడంతో పాటు ఆముదం మొక్కలు పెరిగాక వాటి ఆకులు తీగ చిక్కుడుకు షేడ్‌నెట్‌లా పనిచేస్తున్నాయి. ఫలితంగా చిక్కుడు పంటపై ఎండ తీవ్రత తగ్గి మంచి దిగుబడి వస్తోందని, ఈ పద్ధతిని అనుసరిస్తున్న రైతులు చెబుతున్నారు.

News January 8, 2026

నేటి యువతను వేధిస్తున్న మానసిక జబ్బు ఇదే!

image

ఏకాగ్రత లేక పనులు వాయిదా వేస్తూ గందరగోళానికి గురవుతున్నారా? అయితే మీరు ‘బ్రెయిన్ ఫాగ్’ బారిన పడినట్లే. నిద్రలేమి, స్క్రీన్ టైమ్ పెరగడం, పోషకాహార లోపం, మద్యం సేవించడం వల్ల తలెత్తే ఈ సమస్య నేటి యువతలో ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి ఇన్‌ఫ్లుయెన్సర్లు చెప్పే చిట్కాలు నమ్మొద్దని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన నిద్ర, వ్యాయామం, పోషకాహారం తీసుకోవాలని అవసరమైతేనే డాక్టర్‌ వద్దకు వెళ్లాలంటున్నారు.

News January 8, 2026

పురుషులను కుక్కలతో పోల్చిన నటి.. నెటిజన్ల ఫైర్

image

మగాళ్లను కుక్కలతో పోల్చుతూ కన్నడ నటి రమ్య(దివ్య స్పందన) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘కుక్క ఎప్పుడు కరిచే మూడ్‌లో ఉంటుందో ఎవరూ చెప్పలేరు. వాటిని షెల్టర్లకు తరలించాలి’ అన్న <<18789967>>సుప్రీంకోర్టు కామెంట్లపై<<>> ఆమె స్పందించారు. ‘మగాళ్ల మైండ్‌ను కూడా చదవలేం. వాళ్లు ఎప్పుడు రేప్/మర్డర్ చేస్తారో తెలియదు. కాబట్టి వాళ్లందరినీ జైలులో పెట్టాలా?’ అని ఇన్‌స్టాలో పోస్టు చేశారు. దీంతో నెటిజన్లు ఫైరవుతున్నారు.