News May 19, 2024
ఈనెల 22న అల్పపీడనం: వాతావరణ శాఖ

కోస్తాంధ్ర, రాయలసీమలో వచ్చే 3 రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, 24లోగా అది వాయుగుండంగా బలపడొచ్చని అంచనా వేసింది. నేడు సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీకాకుళం, అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, గోదావరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Similar News
News January 10, 2026
స్లీపర్ బస్సులపై కేంద్రం కఠిన నిబంధనలు

దేశంలో స్లీపర్ బస్సుల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం నిబంధనలను కఠినతరం చేసింది. గత 6 నెలల్లో జరిగిన ప్రమాదాల్లో 145 మంది మృతి చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇకపై స్లీపర్ బస్సులను ఆటోమొబైల్ కంపెనీలు లేదా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన తయారీదారులే నిర్మించాల్సి ఉంటుందన్నారు. బస్సుల్లో అన్ని రకాల భద్రతా పరికరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
News January 10, 2026
జనవరి 10: చరిత్రలో ఈరోజు

* 1894: కవి పింగళి లక్ష్మీకాంతం జననం. 1972లో జనవరి 10నే ఆయన కన్నుమూశారు. * 1920: నానాజాతి సమితిలో సభ్యత్వం పొందిన భారత్ * 1940: ప్రముఖ గాయకుడు, సంగీత విద్వాంసుడు కేజే ఏసుదాసు పుట్టినరోజు * 1974: బాలీవుడ్ నటుడు హ్రితిక్ రోషన్ జననం (ఫొటోలో)
News January 10, 2026
1275KGల చికెన్‌తో ‘బర్డ్ స్ట్రైక్స్’కు చెక్

రిపబ్లిక్ డే పరేడ్‌లో IAF విన్యాసాలకు పక్షులు అడ్డురాకుండా ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బర్డ్ స్ట్రైక్స్ ప్రమాదాల నివారణకు 1275KGల బోన్‌లెస్ చికెన్‌ను ఉపయోగించనుంది. గద్దలు, ఇతర పక్షులు ఎక్కువగా తిరిగే రెడ్ ఫోర్ట్, జామా మసీద్, మండీ హౌస్, ఢిల్లీ గేట్ సహా పలు ప్రదేశాల్లో ఈనెల 15-26 వరకు 2రోజులకు ఒకసారి తక్కువ ఎత్తు నుంచి మాంసాన్ని కిందికి వదులుతారు. దీంతో అవి తక్కువ ఎత్తులోనే తిరుగుతాయి.


