News May 19, 2024
మెట్రోలో నిర్మలా సీతారామన్‌కు చేదు అనుభవం?

ఢిల్లీ మెట్రో రైలులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. మెట్రోలో ప్రయాణిస్తున్నంతసేపు ప్రయాణికులెవరూ ఆమె కూర్చునేందుకు సీటు ఇవ్వలేదు. దీంతో ఆమె నిల్చునే ప్రయాణం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మంత్రికి కనీస గౌరవం ఇవ్వకపోవడం దారుణమని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సమాజం ఎటు పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 19, 2026
నెలసరికి ముందు ఇవి మేలు..

నెలసరికి ముందు ఆడవారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. వీటి వల్ల ఒళ్లు బరువుగా ఉండటం, కడుపు నొప్పి, రొమ్ముల సలపరం వేధిస్తాయి. దీన్నే ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. ఈ లక్షణాలు తగ్గించడానికి డైట్‌లో డ్రైఫ్రూట్స్, మిల్లెట్స్, పెసలు, అలసందలు చేర్చుకోవాలి. శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఆహారాలు, కూల్ డ్రింక్స్, కాఫీలు ఎక్కువగా తీసుకుంటే నెలసరి సమస్యలు మరింత పెరుగుతాయంటున్నారు నిపుణులు.
News February 19, 2026
వాట్సాప్‌లో ఇంటర్ హాల్ టికెట్స్

TG: ఇంటర్ హాల్ టికెట్ల డౌన్‌లోడ్ లింక్‌లను విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్‌కు పంపినట్లు బోర్డు వెల్లడించారు. tgbie.cgg.gov.in సైట్ సర్వర్లు బిజీగా ఉంటే ప్రత్యామ్నాయంగా WhatsApp లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. సాంకేతిక సమస్యలుంటే కాలేజీ ప్రిన్సిపల్‌ను సంప్రదించాలని సూచించారు. హాల్‌టికెట్‌పై ఉన్న QR Code స్కాన్ చేస్తే ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ చూపిస్తుంది. పరీక్షలు ఈనెల 25 నుంచి జరగనున్నాయి.
News February 19, 2026
5,349 పోస్టులకు నోటిఫికేషన్

<


