News May 19, 2024
ADB: మరో 15 రోజులే.. మీ MP ఎవరు..?
ఎన్నికల ఫలితాలు మరో 15రోజుల్లో వెలువడనున్నాయి. ఎక్కడ ఎవరు MP అనేది తేలనుంది. అంతలోనే నియోజకవర్గాల్లో వివిధ పార్టీల నేతలు జోరుగా చర్చించుకుంటున్నారు. అభ్యర్థుల గెలుపోటములు, మెజారిటీలపై గ్రామగ్రామాన చర్చ నడుస్తోంది. మరోవైపు పలుపార్టీల నేతలు ప్రజలను ఎప్పటికప్పుడు ఓటు ఎవరికి వేశారన్నదానిపై ఆరా తీస్తూ అంచనాలు వేస్తున్నారట. – మరి మీ MP ఎవరవుతారు..? తాజా పరిస్థితి ఏంటి..?
Similar News
News January 14, 2025
ఆదిలాబాద్: పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పొడిగింపు
డా.బీఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు పొడగించినట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగ్రామ్ పేర్కొన్నారు. డిగ్రీ 1, 2, 3వ సంవత్సరం స్పెల్-II, ఓల్డ్ బ్యాచ్ 2016 అంతకుముందు బ్యాచ్‌ల వారు అలాగే రీ అడ్మిషన్ తీసుకున్న వారు సప్లిమెంటరీ ఫీజును ఈ నెల ఈనెల 14వరకు చెల్లించవచ్చన్నారు. ఇందుకు రూ. 500 అపరాధ రుసుం కట్టాలన్నారు.
News January 14, 2025
ADB: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో
సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 7331149141 నంబర్‌కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు కచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.
News January 13, 2025
బ్యాంకు సామగ్రి చోరీకి యత్నం.. ఒకరికి రిమాండ్: CI
ఆదిలాబాద్ కలెక్టరేట్‌లోని SBI బ్యాంకు సామగ్రిని చోరీ చేయటానికి ఆదివారం దుండగులు యత్నించినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. ఇద్దరు దుండగులు బ్యాంకు పాత ఫర్నీచర్, నగదు లెక్కించే చెడిపోయిన యంత్రం చోరీకి ప్రయత్నిస్తుండగా.. వాచ్మెన్ నర్సింలు గమనించారు. ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో వారు పరారయ్యారు. వీరిలో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.