News May 19, 2024
హైదరాబాద్‌లో వర్షం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మలక్‌పేట్, ఖైరతాబాద్, పంజాగుట్ట, కుత్బుల్లాపూర్, చింతల్, కొంపల్లి, జీడిమెట్ల, సికింద్రాబాద్, బేగంపేట, అల్వాల్, బోయిన్‌పల్లి తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. మిగతా ఏరియాల్లోనూ వాతావరణం చల్లబడింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరి మీ ప్రాంతంలోనూ వర్షం కురుస్తోందా?
Similar News
News January 14, 2026
పండుగ రోజున స్వీట్స్ ఎందుకు తింటారు?

సంక్రాంతి ఆరోగ్యప్రదాయిని. చలికాలంలో వచ్చే వాత సమస్యలను తగ్గించడానికి సకినాల్లో వాడే వాము, శరీరానికి వేడినిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నువ్వులు, బెల్లం కలిపి తినడం వల్ల ఐరన్, క్యాల్షియం సమృద్ధిగా అందుతాయి. దంపుడు బియ్యంతో చేసే పొంగలి, ఇన్‌స్టంట్ ఎనర్జీనిచ్చే చెరుకు, పోషకాలున్న గుమ్మడికాయ శరీరానికి బలాన్నిస్తాయి. ఇంటి ముంగిట పేడ నీళ్లు, మామిడాకులు బ్యాక్టీరియాను దూరం చేస్తాయి.
News January 14, 2026
RFCLలో 36పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (<
News January 14, 2026
‘అక్కడ మహిళల్ని..’ DMK MP వివాదాస్పద వ్యాఖ్యలు

DMK MP దయానిధి మారన్ ఉత్తరాది మహిళలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. TNలో మహిళలను చదువుకోమని ప్రోత్సహిస్తుంటే.. ఉత్తరాదిలో మాత్రం వారిని ‘వంటగదికే పరిమితం చేస్తూ, పిల్లల్ని కనమని’ చెబుతున్నారని విమర్శించారు. ద్రవిడ మోడల్ వల్లే TN అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ వ్యాఖ్యలపై BJP తీవ్రంగా మండిపడింది. మారన్ ఉత్తరాది వారిని అవమానిస్తున్నారని.. ఆయనకు కనీస జ్ఞానం లేదని ధ్వజమెత్తింది.


