News May 19, 2024
బాలీవుడ్‌లో కొనసాగడంపై కంగనా ఆసక్తికర కామెంట్స్

తాను ఎన్నికల్లో గెలిచినా సినిమాల్లోనే కొనసాగాలని దర్శకులు, నిర్మాతల నుంచి విజ్ఞప్తులు వస్తున్నట్లు BJP ఎంపీ అభ్యర్థి కంగనా చెప్పారు. ఎంపీగా గెలిస్తే సినిమాల్లో కొనసాగుతారా? అనే ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. తాను ఇప్పటికే ఎన్నో అవార్డులు గెలుచుకున్నానని.. ఎంపీగా ప్రజలకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కొన్ని సినిమాలు పెండింగ్‌లో ఉండటంతో బాలీవుడ్‌ను విడిచిపెట్టలేనని మరో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
Similar News
News January 13, 2026
ముంబై టార్గెట్ ఎంతంటే?

WPL-2026లో ముంబైతో మ్యాచులో గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 192/5 స్కోరు చేసింది. ఓపెనర్ డివైన్(8) విఫలమవ్వగా మూనీ(33) ఫర్వాలేదనిపించారు. చివర్లో ఫుల్మాలి 15 బంతుల్లో 36 రన్స్ చేయగా, జార్జియా(43) తోడ్పాటునందించారు. ముంబై బౌలర్లలో ఇస్మాయిల్, మాథ్యూస్, కేరీ, అమేలియా తలో వికెట్ తీశారు. MI టార్గెట్ 193.
News January 13, 2026
ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ ప్రజలు తమ పోరాటాన్ని కొనసాగించాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ‘ఇరాన్ దేశభక్తులారా.. ప్రభుత్వ సంస్థలను చేజిక్కించుకోండి. మిమ్మల్ని చంపే వారి, నిందించే వారి పేర్లను సేవ్ చేసుకోండి. వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. నిరసనకారులను చంపడం ఆపేంత వరకు ఇరాన్ ప్రతినిధులతో నా మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నా. మీకు అతిత్వరలో సాయం అందబోతోంది. Make Iran Great Again (MIGA)!’ అని ట్రంప్ పోస్ట్ చేశారు.
News January 13, 2026
నిరసనలు ప్రపంచానికి తెలియకుండా.. ఇంటింటికీ వెళ్లి..!

నిరసనలను ఉక్కుపాదంతో అణచేస్తున్న ఇరాన్ ఆ వివరాలు ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తపడుతోంది. ఇప్పటికే ఇంటర్నెట్ నిలిపేయగా, మస్క్‌కు చెందిన <<18836391>>స్టార్‌లింక్ సేవలనూ<<>> 80% కట్ చేసింది. ఇంకా వాడుతున్న వారిని వెంటాడుతోంది. ఇళ్లలో సోదాలు చేసి స్టార్‌లింక్ పరికరాలు స్వాధీనం చేసుకుంటోంది. అధికారులు, ఖమేనీ సపోర్టర్లు ‘వైట్‌లిస్ట్(అనుమతి ఉన్న వారికే యాక్సెస్ ఉండే)’ నెట్‌వర్క్‌లో కమ్యూనికేట్ అవుతున్నారు.


