News May 19, 2024
రాయితీపై పంపిణీకి సిద్ధంగా విత్తనాలు
NLR: ఖరీఫ్ సీజన్‌లో భాగంగా బోర్ల కింద పంట సాగు చేసే రైతులకు సబ్సిడీపై పంపిణీ చేసేందుకు 4316 క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధం చేసినట్లు వ్యవసాయ శాఖ నెల్లూరు జేడీ సత్యవాణి తెలిపారు. కిలోకి రూ.5 చొప్పున సబ్సిడీ ఇస్తున్నామన్నారు. మినుము, పెసర, కందుల విత్తనాలను కూడా 50 శాతం సబ్సిడీపై అందజేయనున్నట్లు వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, పచ్చిరొట్ట విత్తనాలూ అందుబాటులో ఉన్నాయన్నారు.
Similar News
News November 17, 2024
నెల్లూరు: పైలెట్ ప్రాజెక్ట్ పాఠశాలల పని వేళల్లో మార్పు
నెల్లూరు జిల్లాలోని పాఠశాలల సమయాల మార్పులలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మండలంలో ఒక హైస్కూలు, హై స్కూల్ ప్లస్‌ను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి పని వేళల్లో మార్పులు చేస్తున్నట్ల DEO బాలాజీ తెలిపారు. పాఠశాల ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంకాలం 5 గంటలకు ముగుస్తుందన్నారు. గతంలో నాలుగు గంటలకే పాఠశాల ముగిసే విషయం తెలిసిందే.
News November 17, 2024
వెంకటగిరిలో చికెన్ ధర రూ.210
ఆదివారం మాంసం విక్రయాలకు ఉన్న డిమాండ్ చెప్పనవసరం లేదు. సామాన్యులు ఆదివారం రోజైనా మాంసం తినాలని కోరుకుంటారు. పెరిగిన ధరలతో ప్రజలు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రస్తుతం వెంకటగిరిలో చికెన్ కిలో రూ.210గా ఉంది. నాటు కోడి ధరలు కొన్ని ప్రాంతాల్లో ఏకంగా కిలో రూ.600పైగా ఉన్నట్లు సమాచారం. ఇక పొట్టేలు మాంసం ధర రూ.700, మేకపోతు మాంసం ధర కిలో రూ.800 వరకు ఉంది. మీ ఊరిలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News November 17, 2024
నెల్లూరు: ఉరి వేసుకున్న యువకుడు
నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నఘటన శనివారం వెంకటాచలం మండలంలో వెలుగుచూసింది. జాకీర్ హుస్సేన్‌నగర్‌కు చెందిన గండికోట సురేంద్రబాబు(36) పాలిచెర్లపాడు వద్ద అడవిలో ఉరి వేసుకున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పోస్ట్ మార్టం కోసం బాడీని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబీకులకు సమాచారం అందించారు.