News May 19, 2024

భారత కోచ్ పదవి క్రికెట్‌లోనే గొప్పది: లాంగర్

image

ప్రపంచంలోనే ఎక్కువ మంది క్రికెట్ అభిమానులు, అత్యధిక అంచనాలున్న టీమ్ ఇండియాకు కోచ్‌గా చేయడం పెద్ద సవాలు అని లాంగర్(LSG కోచ్) అభిప్రాయపడ్డారు. ఈ పదవి సాధించడం క్రికెట్‌లోనే గొప్ప విషయమని పేర్కొన్నారు. భారత కోచ్‌ పదవి ఒత్తిడితో కూడుకున్నదన్నారు. అదే సమయంలో సరదాగా కూడా ఉంటుందని చెప్పారు. T20WC తర్వాత ద్రవిడ్ పదవీకాలం ముగియనుండటంతో కొత్త కోచ్ కోసం BCCI దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే.

Similar News

News December 23, 2024

పూజా ఖేడ్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

image

UPSC నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన పూజా ఖేడ్క‌ర్ ముందస్తు బెయిల్ పిటిష‌న్‌ను ఢిల్లీ HC తోసిపుచ్చింది. తప్పుడు ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌తో సివిల్స్‌లో ప్ర‌యోజ‌నాలు పొందారన్న ఆరోపణలపై ఆమెను కేంద్రం స‌ర్వీసు నుంచి తొలగించింది. ప్ర‌తిష్ఠాత్మ‌క సంస్థ‌ను మోసం చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమెకు గ‌తంలో క‌ల్పించిన మ‌ధ్య‌ంత‌ర ర‌క్ష‌ణ‌ను కూడా కోర్టు తొల‌గించింది. త్వరలో ప్ర‌భుత్వం ఆమెను విచారించే అవ‌కాశం ఉంది.

News December 23, 2024

అల్లు అర్జున్ మామ వచ్చినట్లు మాకు తెలియదు: మహేశ్ కుమార్

image

TG: అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గాంధీభవన్‌కు వచ్చినట్లు తమకు తెలియదని TPCC చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. ఆయనొచ్చిప్పుడు తాము ప్రెస్‌మీట్లో ఉన్నామన్నారు. తర్వాత చంద్రశేఖర్ ఫోన్ చేసి మాట్లాడారని, మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పినట్లు వెల్లడించారు. AAతో తమకు వ్యక్తిగతంగా ఎలాంటి వైరం లేదని మహేశ్ మరోసారి స్పష్టం చేశారు. గాంధీభవన్‌కు వచ్చిన చంద్రశేఖర్‌ను మున్షీ మాట్లాడకుండానే పంపించేశారు.

News December 23, 2024

బంగారం ఎంత పెరిగిందంటే?

image

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.84 పెరిగి రూ.80,777గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.77 ఎగిసి 74,045 వద్ద కొనసాగుతోంది. డాలర్ ఇండెక్స్ పెరగడంతో కొన్ని రోజులుగా విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. 2 వారాల్లోనే బాగా తగ్గడంతో నేడు స్తబ్ధత నెలకొంది. ఇక వెండి కిలోకు రూ.100 తగ్గి రూ.91,400 వద్ద చలిస్తోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.240 పెరిగి రూ.25,500 వద్ద ఉంది.