News May 19, 2024

NLG: ఇక పంచాయతీ ఎన్నికలపై దృష్టి

image

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో పంచాయతీ ఎన్నికలపై అధికారులు దృష్టి సారించింది. ఫిబ్రవరిలోనే పంచాయతీలకు పదవీ కాలం ముగియడంతో అప్పటి నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. ఉమ్మడి జిల్లాలోని 1,740 గ్రామ పంచాయతీలకు జూన్ చివరి వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆశావహులు పోటీ చేసేందుకు తమ ప్రయత్నాలు చేస్తున్నారు.

Similar News

News January 17, 2026

నల్గొండ: పారదర్శకంగా మున్సిపల్ రిజర్వేషన్ల ఖరారు: కలెక్టర్ చంద్రశేఖర్

image

జిల్లాలోని నగరపాలక సంస్థతో పాటు ఆరు మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ పద్ధతిలో పారదర్శకగా ఈ కేటాయింపులు చేపట్టారు. 2011 జనాభా లెక్కలు, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ ప్రక్రియ నిర్వహించామని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.

News January 17, 2026

నల్గొండ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి

image

నల్గొండ మున్సిపాలిటీని నగరపాలక సంస్థగా మారుస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో, శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. పాత మున్సిపల్ భవనంలోనే కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. కార్పొరేషన్‌గా మారడంతో నగర అభివృద్ధికి మరిన్ని నిధులు, వసతులు సమకూరుతాయని తెలిపారు.

News January 17, 2026

NLG: మేయర్ పీఠం సహా 9 పురపాలికలు మహిళలకే

image

ఉమ్మడి జిల్లాలో మేయర్ పీఠంతో పాటు 9 పురపాలికల ఛైర్‌పర్సన్ స్థానాలు మహిళలకే దక్కాయి. ఎస్సీలకు రెండు, బీసీలకు 3, జనరల్ 7, జనరల్ మహిళలకు 7 స్థానాలకు రిజర్వు చేశారు. బీసీలకు రిజర్వు చేసిన మూడింటిలో ఒక్కటి మాత్రమే జనరల్ కాగా రెండు మున్సిపాలిటీలు మహిళలకే రిజర్వు చేయడం విశేషం.