News May 19, 2024
పుంగనూరు: మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రాజలూరి గ్రామానికి చెందిన బాలాజీ (24) మనస్తాపంతో ఉరేసుకుని ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలం చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 14, 2026
చిత్తూరు కోర్టులో ఉద్యోగాలు

చిత్తూరు జిల్లా కోర్టులో పర్మినెట్ ఉద్యోగాల నియామకానికి ప్రధాన న్యాయమూర్తి మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. రికార్డు అసిస్టెంట్-1, డేటా ఎంట్రీ ఆపరేటర్-1, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్-1 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈనెల 27వ తేదీలోపు దరఖాస్తుకు చేసుకోవాలి. అర్హత, జీతం తదితర వివరాలకు చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాలి.
News January 14, 2026
సంక్రాంతి పండుగ ఐక్యత నింపాలి: కలెక్టర్ సమిత్ కుమార్

సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఐక్యత నింపాలని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిమళం వెదజల్లేలా ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల నడుమ సుహృద్భావ వాతావరణంలో, ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.